Giorgia Meloni: విడాకులు తీసుకోబోతున్న ప్రధాన మంత్రి..!
ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మెలోని త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. పదేళ్ల తమ దాంపత్య జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా చెప్పారు.
Giorgia Meloni: జార్జియా మెలోని. ఇటలీ ప్రధాన మంత్రి. ఆ దేశానికి తొలి మహిళా ప్రధాన మంత్రి కూడా. ఈమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఫేస్ చూస్తే మాత్రం ప్రతీ ఒక్కరూ గుర్తు పడతారు. ఎందుకంటే ఆమె ఇంటర్నెట్‌లో అంత ఫేమస్. రీసెంట్‌గా భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో కూడా మెలోని పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మెలోని త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
పదేళ్ల తమ దాంపత్య జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా చెప్పారు. పదేళ్ల పాటు తనతో జీవితాన్ని పంచుకుంన్నందుకు తన భర్త జంబ్రూనో కృతజ్ఞతలు చెప్పారు. కొంత కాలంగా తమ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని.. ఇప్పుడు ఇక వాటికి దూరంగా కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పారు. తన జీవితంలో తనకు అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం తన బిడ్డ మాత్రమే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెలోని. తన బిడ్డను తనకు ఇచ్చింనందుకు తన భర్తకు థాంక్స్ చెప్పారు. ఇప్పటి నుంచి తమ దారులు వేరుగా ఉంటాయంటూ చెప్పారు. వృత్తి పరంగా టీవీ యాంకర్ అయిన జంబ్రూనోకు సంబంధించిన కొన్ని వీడియోలు రీసెంట్‌గా వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో జంబ్రూనో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం దుమారాన్ని లేపింది.
ఈ కారణంగానే వాళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు టాక్. మెలోని చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సాధారణ వ్యక్తులు జీవితంలో సమస్యలు ఉండి విడాకులు తీసుకోవడం సహజమే. కానీ ప్రధాన మంత్రి స్థానంలో ఉండి విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాంపత్య సమస్యల ముందు ప్రధాని అయినా సామాన్యులైనా ఒక్కటే అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.