Japan population: ముసలోళ్లతో జపాన్‌కు కొత్త చిక్కులు..!

ప్రపంచంలో మంచి ఖ్యాతి గణించిన దేశాలకు ఏమైంది. నిన్నటి వరకూ చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు అదే పరిస్థితి జపాన్ ఎదుర్కోంటోంది. దీనివల్ల దేశంలో పరిస్థితి అతలాకుతం అవుతోంది. భవిష్యత్ మీద ఆశ సన్నగిల్లుతోంది. జపాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ముఖ్యకారణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2023 | 04:53 PMLast Updated on: Mar 07, 2023 | 9:28 PM

Japan Population Crisis Effect

జపాన్ అనగానే అణుబాంబులకు బలై మళ్లీ అనతి కాలంలోనే ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధించిన దేశం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా పారిశ్రామిక పరంగా అభివృద్ది చెందింది. దీనికి అట్టడుగు పరిస్థితి తెలుసు, దానిని అధిగమించే దారి తెలుసు. ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచదేశాలన్నీ తనవైపు చూసేలా నూతన అధ్యాయాన్ని లిఖించుకుంది. అలాంటి జపాన్ కు నేడు గడ్డుకాలం ఏర్పడబోతుంది. అదే జనాభాలో వచ్చిన విశేష మార్పులు. ఇక్కడ పూర్తి పారిశ్రామిక అభివద్ది కేంద్రంగానే అడుగులు పడుతూ ఉంటాయి. అందులో పనిచేసేవారు దాదాపు వృద్దులే కావడం ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

జపాన్ యువ జనాభా చైనాలాగే రోజురోజుకూ క్షీణిస్తుంది. ముఖ్యంగా పనిచేసే వయస్కుల పాపులేషన్ చాలా క్షీణించింది. దీంతో కార్మిక వ్యవస్థపై తీవ్ర పరిణామాన్ని చూపిస్తూంది. దశాబ్థాల కాలం నుంచి పారిశ్రామిక మార్కెట్లో కార్మిక జనాభా కీలక భూమిక పోషిస్తూ వస్తుంది. ప్రస్తుతం వారు పదవీవిరమణ పొందే పరిస్థితులకు వచ్చేశారు. వీరిని అధిగమించి మార్కెట్ ఉత్పత్తులను ఎదుక్కొనే యువ కార్మికులు ఇప్పుడు అందుబాటులో లేరు. అలాంటి పరిస్థితుల్లో వృద్ద జనాభా పై ఆధారపడితే భవిష్యత్తులో ఉత్పత్తిరంగం దెబ్బతినే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అంచనా.

సాధారణంగా ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమానికి నిధులలో ముసలి వాళ్లుకు అధిక మొత్తంలో కేటాయించాల్సి వస్తుంది. వృద్దాప్య పెంక్షన్ నుంచి ఆరోగ్య వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి మామూలుగా లేదు. కొన్ని వేలకోట్ల నిధులు వృద్దుల శ్రేయస్సుకు వినియోగించడం పెద్ద సవాలుగా మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘాయువును కలిగి ఉన్న వారు ఈ దేశంలో ఉన్నారు. దీంతో జపాన్ చరిత్రలోకి ఎక్కింది. ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉండటం ఈ దేశంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చిన మార్పు కాదు. దశాబ్ధాలుగా తగ్గుతూ వచ్చి నేడు ఇలాంటి పరిణామాలను దారితీసింది. 2025 నాటికి, పని చేసే వయస్సులో ఉన్న ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒక వృద్ధుడు ఉంటాడట. అందుకే జపాన్ ఇతర ప్రధాన పారిశ్రామిక దేశాల కంటే ఎక్కువ వృద్ధాప్య డిపెండెన్సీ నిష్పత్తిని కలిగి ఉంటుంది.

జపాన్ లో యుద్దం తరువాత మహిళల సంతానోత్పత్తి రేటు సగటును ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ఉద్దేశ్యం ఒక స్త్రీ ఇందరినే కనాలనేలా ప్రతిపాదించారు. ఈ తీర్మానం దెబ్బకు కేవలం పది సంవత్సరాల వ్యవధిలో భారీ స్థాయిలో క్షీణత చవిచూసింది. స్త్రీ సంతోనోత్పత్తి రేటు 1950లో 32శాతం ఉండగా. 1960లో 2శాతానికి పడిపోయింది. ఇలా క్రమక్రమంగా క్షీణించి ప్రస్తుతం భర్తీరేటు కంటే సంతానోత్పత్తి రేటు పాతాళానికి పడిపోయింది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. పురుషుల, స్త్రీల మధ్య జీతాల అంతరం తగ్గడం. పిల్లల పెంపకంలో ఇబ్బందులు రావడం. వృద్దుల ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంచే ఉదారమైన సామాజిక భద్రతా వ్యవస్థ వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

వయోజన జనాభాలో (వయస్సు 15 సంవత్సరాల వయస్సు గల) యువకుల ప్రవాహం గత 40 సంవత్సరాలలో గణనీయంగా తగ్గింది. 1950-2000 వరకూ ఈ ఐదు దశాబ్థాలలో జనాభా పెరుగుతుందని ఆశించినప్పటికీ సంతానోత్పత్తిలో ఎటువంటి మార్పులేదు. గతం కంటే చాలా తక్కువ స్థాయిలో గణాంకాలు నమోదవుతున్నాయి. పైగా వలసల పేరుతో కొంతమంది వేరే దేశాలకు వెళ్లిపోయారు. తద్వారా కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపింది. దీని ప్రభావంతో ప్రస్తుతం 81 సంవత్సరాల వయస్సు కల్గిన వారు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతుంది. రానున్న దశాబ్ధ కాలంలో 65 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఎక్కవగా ఉంటారన్నది ఈ నివేదిక సారాంశం. అందుకే 2013 నుంచి పెన్షన్ ఇచ్చే వయసును 60 నుంచి 65 కు పెంచారు. దీనిని బట్టీ అర్థంమైంది ఏమిటంటే జపాన్ జనాభా ఇతర ప్రధాన పారిశ్రామిక దేశాల జనాభా కంటే అత్యంత వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. అందుకే చైనాలో లాగా కాకపోయినా జపాన్ లో వివాహాలు, జనాభాను ప్రోత్సహించేందుకు రకరకాలా చర్యలు చేపడతామని గత ఏడాది సూచిందింది.

దీని ప్రభావం ఆర్థిక ఉత్పత్తి తగ్గిపోవడానికి దారి తీస్తుంది. ఎందుకంటే పనిచేసే వారు లేనప్పుడు వస్తుఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. తద్వారా పరిశ్రమలు ఎక్కువ వస్తువులను అందుబాటులోకి తీసుకురాలేవు. ఎప్పుడైతే ఎక్కువ వస్తువులు ఉత్పత్తికావో తగిన జనాభాకు అవసరమైన వస్తువులను అందించలేము. అప్పుడు దీని ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీస్తుంది. ఇలా దేశ తలసరి ఆదాయం పై పడుతుంది. ప్రస్తుతం ఉన్న స్థిర జనాభాతో బేస్ లైన్ ను పోల్చి చూస్తే రానున్న దశాబ్ధ కాలంలో వాస్తవ జీడీపీ స్థాయి 20శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక తెలుపుతుంది.

 

 

T.V.SRIKAR