బ్రేకప్ అయినవాళ్లకు జాబ్స్
ఈ కాలంలో లవ్ చేయనివాళ్లు.. బ్రేకప్ అవ్వనివాళ్లు దాదాపుగా ఉండరు. ఈ బ్రేకప్‌ను క్వాలిఫికేషన్‌గా తీసుకుంటే దాదాపు 90 పర్సంట్ యూత్‌కి జాబ్స్ వచ్చేస్తాయి.
ఈ కాలంలో లవ్ చేయనివాళ్లు.. బ్రేకప్ అవ్వనివాళ్లు దాదాపుగా ఉండరు. ఈ బ్రేకప్‌ను క్వాలిఫికేషన్‌గా తీసుకుంటే దాదాపు 90 పర్సంట్ యూత్‌కి జాబ్స్ వచ్చేస్తాయి. మేబీ ఇలాగే ఆలోచించారు అనుకుంటా.. బెంగళూరులో ఓ కంపెనీ బ్రేకప్‌ని క్వాలిఫికేషన్‌గా పెట్టి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. యస్ మీరు విన్నది కరెక్టే. మీకు బ్రేకప్ ఐతే చాలు ఈ కంపెనీలో మీకు ఉద్యోగం గ్యారెంటీ. బెంగళూరుకు చెందిన టాప్-మేట్ అనే మెంటరింగ్, కన్సల్టింగ్ కంపెనీ ఈ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
వీళ్ల దగ్గర చీఫ్ డేటింగ్ ఆఫీసర్‌గా పని చెయ్‌డానికి బ్రేకప్‌లో అనుభవం ఉన్న పర్సన్స్ కావాలంట. ఈ ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉండాలని కండీషన్స్ పెట్టింది ఈ కంపెనీ. లవ్, ఆన్‌లైన్ డేటింగ్ లాంటి వాటిలో ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉండాలి. కనీసం రెండు మూడు సిచ్యువేషన్‌షిప్‌లు మెయిన్‌టేన్ చేసి ఉండాలి. లేటెస్ట్ డేటింగ్ యాప్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ముందే చెప్తున్నాం.. బ్యాక్‌డోర్, క్యాట్ ఫిషింగ్‌కి అసలే ఛాన్స్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్ ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేకుండా వీళ్లు చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్ట్‌కు హైరింగ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో మీ లవ్ స్టోరీ ఎలా బ్రేక్ అయ్యింది అనేది వీళ్లకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.
వాళ్లు అడిగే ప్రశ్నలకు జెన్యూన్‌గా ఆన్సర్ చెయాలి వాళ్లు ఇచ్చే టెక్నికల్ టాస్క్‌లు ఫినిష్ చేయాలి. అంతే మీకు జాబ్ వచ్చేస్తుంది. అయితే జాబ్‌లో జాయిన్ అయ్యాక ఏం చేయాల్సి ఉంటుంది, శాలరీ ఎంత అనే విషయంలో మాత్రం ఈ కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీళ్లు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం దిమ్మతిరిగే రేంజ్‌లో వైరల్ అవుతుంది. చాలా మంది లవ్ బ్రేకప్ అవ్వడంతో డిప్రెషన్‌లో చదువు, జాబ్స్ పోగొట్టుకుంటారు. అలాంటిది బ్రేకప్ అవ్వడమే క్వాలిఫికేషన్ అంటే.. మా బ్యాచ్‌లో అందరికీ జాబ్స్ వచ్చేస్తాయ్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ జాబ్‌కు మీరు కూడా క్వాలిఫై అవుతారా లేదా కింద కామెంట్ చేయండి.