KERALA TRANSGENDER: దేశంలోనే మొట్టమెదటి సారి తల్లిగా మారిన ట్రాన్స్ జెండర్ – మరో నెలలో ఓ జీవికి ప్రాణం పోస్తుంది..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2023 | 05:33 AMLast Updated on: Feb 05, 2023 | 3:58 PM

Kerala Transgender దేశంలోనే మొట్టమెదటి స

స్త్రీ పెళ్లిచేసుకొని తల్లి అవ్వడం సాధారణమైన విషయం. అదే ఓ ట్రాన్స్ జెండర్ తల్లి అయితే.. చాలా అసాధారణమైన అంశం. ప్రస్తుతం ట్రాన్స్ జండర్ లు సమాజంలో స్త్రీ పురుషులకు సమానంగా రాణిస్తున్నారు. విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఒకఅడుగు ముందంజలో ఉన్నారని చెప్పాలి. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జియా (Ziya)- జహద్‌ (Zahad) అనే ట్రాన్స్‌జెండర్‌ జంట బిడ్డను దత్తత తీసుకోవడమో, సరోగసి పద్దతిలోనో బిడ్డను కనడం లేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ గర్భవతిగా మారి బిడ్డకు జన్మనివ్వబోతోంది. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా ఈ శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. మరో నెలరోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది. మార్చి నెలలో తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈవార్తను ప్రకటించింది.

‘నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు నన్ను ‘అమ్మా’ అని పిలవాలనే కల నాలో ఉంది. మేము కలిసి మూడు సంవత్సరాలు అయ్యింది. తల్లి కావాలని నేను, తండ్రి కావాలని అతను (జహాద్) కలలుకన్నాం. ఆ కల త్వరలో నెరవేరబోతోంది. అతని కడుపులో ఎనిమిది నెలల జీవం ప్రాణం పోసుకుంటోంది’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇదే సందర్భంలో వీరు తమ ప్రెగ్నెన్సీ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే ఇదే తొలిసారి. అయితే, సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్‌ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

హిజ్రాలకు సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే వీరిలో అండాలు, గర్భాశయం ఉండదు. వారు కేవలం శారీరకంగా స్త్రీ లక్షణాలు కలిగిఉంటారు. ఇక్కడ జరిగింది పూర్తిగా విరుద్దమైన క్రియ. అందుకే కొత్తగా అనిపిస్తుంది. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తర్వాత గర్భందాల్చడం ఎలా సాధ్యం అనే అనుమానం కలుగుతుంది. ఈ ట్రాన్స్ జెండర్ల జంట తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అతనికి పిల్లలు పుట్టరు. ఎందుకంటే పైన చెప్పిన విధంగా బిడ్డను జన్మనిచ్చేందుకు తగిన ఆర్గాన్స్ వారిలో ఉండవు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా… తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ దానిని కొంతకాలం వాయిదా వేసుకున్నాడు. అయితే ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు. అతనిగా ఉన్న ఆమెకు గర్భాశయంతో పాటూ తల్లి అవ్యడానికి సంబంధించిన భాగాలను తొలగొంచినట్లయితే ఇక్కడ గర్భందాల్చే అవకాశం ఉండేది కాదు. సైన్స్ కి ఆడ,మగ తేడా అవసరం లేదు. ఒక కొత్త జీవికి జన్మనివ్వడానికి సరిపడా ప్రత్యుత్పత్తి అవకాశాలు ఉంటే చాలు. ఇక్కడ సరిగ్గా ఇదే జరిగింది. ఏది ఏమైనా ఇది వైద్యరంగంలో వింత అవ్వకపోయినా.. సమాజం దృ‎ష్టిలో చాలా సాహసోపేతమైన అంశంగా చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Ziya Paval (@paval19)

ప్రెగ్నెన్సీ చిత్రాలపై ఇన్‌స్టా వినియోగదారులు ఈ జంటను తెగ అభినందిస్తున్నారు. జియా పావల్ పెట్టిన ఓ పోస్టుకు 19 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇలాంటి మరికొన్ని ఫొటోలను రెండు పోస్టుల్లో షేర్ చేయగా.. ఒక పోస్టుకు రెండు వేలకు పైగా లైకులు, మరో పోస్టుకు 1500కు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ప్రతీ ఒక్కరూ తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా… ప్రేమకు అవధులు లేవని నిరూపించేందుకు నిదర్శనం ఈ జంట అని కామెంట్ చేశారు. మరి కొందరైతే “చాలా సంతోషంగా ఉంది.. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు” అని చెప్పారు.