Kedarnath Rains: కేదార్‌నాథ్‌ను వణికిస్తున్న వానలు.. గౌరీకుండ్‌లో పరిస్థితి భయంకరం..
భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయ్. అకాల వరదల కారణంగా పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయ్. కేదర్‌నాథ్ యాత్రకిలు వెళ్లే మార్గంలోని గౌరీకుండ్ ప్రాంతంలో వరదల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Kedarnath Rains: ఉత్తరాదిని వర్షాలు విడిచిపెట్టడం లేదు. భారీ వర్షాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం అదే భయం కంటిన్యూ అవుతోంది. ఉత్తరాఖండ్‌లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయ్. అకాల వరదల కారణంగా పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయ్. కేదర్‌నాథ్ యాత్రకిలు వెళ్లే మార్గంలోని గౌరీకుండ్ ప్రాంతంలో వరదల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఈ ఘటనలో 12మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడిన చోటుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గాలింపు ప్రారంభించాయి. గల్లంతైన వారిలో నేపాల్‌కు చెందిన యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గంగోత్రి నేషనల్ హైవేతో పాటు, నంద్ ప్రయాగ్ ప్రాంతంలో జాతీయ రహదారి క్లోజ్ చేశారు. వర్షాలతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇక అటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజులు ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పౌరీ, టెహ్రీ, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చమోలి, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.