Home »Social » Lets Know What Are The Special Features Of Indias Lakh Islands
India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..
లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.
Let's know what are the special features of India's Lakh Islands..
లక్షద్వీప్ అనే సంస్కృత పదానికి ఇంగ్లిష్లో a hundred thousand islands అని అర్థం.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. మొత్తం 36 ద్వీపాలు 32.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.
లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ దీవి (4.5 చదరపు కిలోమీటర్లు). అతిచిన్న దీవి బిత్రా (Bitra)
కేరళ తీరం (మలబార్ తీరం) నుంచి 220 నుంచి 440 కిలోమీటర్ల దూరంలో దక్షిణ అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి.
ఇది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. అక్షరాస్యులు అధికంగా కలిగి ఎస్సీ, ఎస్టీలు లేని ప్రాంతం.
ఈ దీవుల మీదుగానే పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత దేశ తీరాన్ని చేరుకున్నాడు.
ఈ లక్ష దీవ్వుల్లో 32 దీవులు సముహం ఉన్నాయి. అందులో పర్యటక ప్రాంతాలకుగా.. బంగారం ద్వీపం, కడమట్ ద్వీపం, అగట్టి ద్వీపం, కవరత్తి ద్వీపం, కల్పేని ద్వీపం, మాలిక్ ద్వీపం, మొయిదీన్ మసీద్ ద్వీపం ఉన్నాయి.
( బంగారం ద్వీపం )…
బంగారం ద్వీపం అనేది ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఉప్పునీటి పాయ చుట్టూ ఉన్న వలయాకార భూభాగం అని చెప్పలి.ఇది లక్షద్వీప్ అనే కేంద్ర పాలిత ప్రాంతం లోని భూభాగం.ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.
( కడమట్ ద్వీపం )..
కడమట్ ద్వీపాన్ని కార్డమామ్ ద్వీపం అని కూడా పిలుస్తారు.ఇక్కడ స్కుబాడైవింగ్, స్నూకరీంగ్ మరియు స్విమ్మింగ్ వంటి ప్రత్యేకం.ఇక్కడ లోతులేని చెరువులో అయినట్లయితే 2500 రూపాయలతో, సముద్రంలో అయినట్లయితే 4000 రూపాయలతో స్కుబాడైవింగ్ చేయవచ్చు.
( అగట్టి ద్వీపం )..
అగట్టి ద్వీపాన్ని లక్షద్వీప దీవుల ముఖద్వారం గా పిలుస్తారు. భారత దేశం నుండి వెళ్ళే ప్రయాణికులు విమానం లేదా నౌకా ప్రయాణం ఏదైనప్పటికీ తప్పక ఈ ప్రాంతం చేరాల్సిందే.
( కవరత్తి ద్వీపం )..
లక్ష ద్వీపాలలో వినోదానికి కవరత్తి ప్రధాన కేంద్రం గా వుంది.ఇండియాలోని కోచ్చి పట్టణానికి 360 కి.మీ.ల దూరంలోనూ, ఆగట్టి ద్వీపానికి 50 కి.మీ.ల దూరం లోను కలదు. ఇండియా నుండి బోటు లో లేదా ఆగట్టి నుండి హెలికాప్టర్ లో చేరవచ్చు.
( కల్పేని దీవి )..
ఇండియా లోని కోచ్చిన్ కు సుమారు 150 మైళ్ళ దూరంలో కల ఒక చిన్న దీవి కల్పేని. దీని విస్తీర్ణం సుమారు 2.8 చ.కి.మీ.లు కలిగి వుంటుంది. ఉత్తర దక్షిణాలుగా పొడిగించబడిన ఈ దేవి అందమైన 2.8 చ. కి. మీ.ల సముద్రం కలిగి వుంది
( మాలిక్ ద్వీపం )..
మాలిక్ ద్వీపాన్ని మినీ కాయ్ ద్వీపం లేదా మాలిక్ అటల్ అని కూడా అంటారు.ఈ ద్వీపం లక్ష ద్వీపాలలో దక్షిణ భాగం చివరలో వుంటుంది. మాల్దీవులకు మినీ కాయ్ దీవికి భాష పరంగా మరియు సాంస్కృతి పరంగా అనేక పోలికలు వుంటాయి.
( మొయిదీన్ మసీద్ ద్వీపం )..
ఈ మసీద్ కల్పేని ద్వీపంలో కలదు.ఇక్కడ ప్రవేశ భాగం సుమారుగా 350 సంవత్సరాల పూర్వం పునర్నిర్మించినారు.ఇక్కడ సముద్రానికి దగ్గరిలో ఏడు చెరువులు ఉన్నాయి.
ఈ దీవులు 1 నవంబర్ 1973లో లక్క దీవులు, మినికాయ్, అమిని దీవుల కలయిక వల్ల ఏర్పడ్డాయి.