Low Population: 30 వేల మంది జనాభా కూడా లేని దేశాలు ఇవే..
పాపులేషన్‌లో ఇండియా నెంబర్ వన్ పొజిషన్‌కు రీచ్ అయ్యింది. ఇప్పటి వరకూ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న చైనాను సెకండ్ ప్లేస్‌కు నెట్టేసింది. రీసెంట్ కౌంట్ ప్రకారం ఇండియన్ పాపులేషన్ 142 కోట్ల 86 లక్షలు. ఇండియా నెంబర్ వన్‌లో ఉంది సరే.. కానీ కనీసం లక్ష మంది ప్రజలు కూడా లేని చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటికన్ సిటీ వరల్డ్‌లోనే అన్నిటికంటే చాలా చిన్న దేశం ఇక్కడ ఓన్లీ 518 మంది మాత్రమే నివసిస్తున్నారు.
ఈ దేశ విస్తీర్ణం చదరపు కిలోమీటరు లోపే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మతబోధకులు, నన్‌లు కనిపిస్తారు. సిస్టీన్ ఛాపెల్, సెయింట్ పీటర్స్ బసిలికా, సెయింట్ పీటర్స్ స్క్వేర్ వంటి ముఖ్యమైన నిర్మాణాలు ఇక్కడే ఉన్నాయి. స్క్వేర్‌లో దాదాపు 80 వేల మందికి వసతి కల్పించవచ్చు. పోప్ ఫ్రాన్సిస్ సందేశాన్ని వినేందుకు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వాటికన్ సిటీకి వస్తుంటారు. హవాయి, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న “టువలు” దేశం కూడా అతి తక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఒకటి.
కేవలం 26 స్క్వేర్ కిలో మీటర్స్ విస్తీర్ణంలోనే ఈ దేశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 11 వేల 396 మంది నివసిస్తున్నారు. ఇక్కడ రోజురోజుకూ సముద్ర జళాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ దేశం ఉండకపోవచ్చు కూడా. ఇక్కడ ఉండేవాళ్లు వాళ్ల పూర్వీకులు అనుసరించిన జీవన విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. క్రికెట్‌లా ఉండే కిలికిటి అనే గేమ్ ఇక్కడ చాలా ఫేమస్. జస్ట్ 21 స్క్వేర్ కిలోమీటర్లలో విస్తరించిన మరో ఐలాండ్ కంట్రీ “నౌరు”.
ఇక్కడ ఓన్లీ 12 వేల 780 మంది మాత్రమే ఉంటున్నారు. పాస్పేట్ తవ్వకాల కారణంగా ఇక్కడ 80 పర్సెంట్ భూమి నాశనమైంది. 1800వ సంవత్సరంలో యూరోపియన్లు ఇక్కడ అడుగుపెట్టారట. “పలౌ” అనే మరో దేశం కూడా ప్రపంచలోని తక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఒకటి ఇక్కడ 18 వేల 58 మంది మాత్రమే జీవిస్తున్నారు. 459 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించిణ ఈ దేశం పసిఫిక్ దీవుల్లో ఉంది. క్రీస్తుపూర్వం సుమారు 2వేల ఏళ్ల కిందటే ఇక్కడ మనుషుల సంచారం ఉండేదట. 1914 నుంచి 44 వరకు ఇది జపాన్ అధీనంలో ఉంది. ఆ తరువాత అమెరికా చేతుల్లోకి వెళ్లింది. 1994లో పలౌ స్వతంత్ర దేశంగా అవతరించింది.