Mansoons: ఈసారి ఆలస్యంగా రుతుపవనాలు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..
ఎండలు చుక్కలు చూపిస్తున్నాయ్. భానుడి భగభగలకు మాడు పగిలిపోతోంది. ప్రతీ డే.. ఫ్రై డేలానే మారిపోయింది సీన్. సూర్యుడు ఎండలతో మనుషులను ఫ్రై చేస్తున్నాడనిపిస్తోంది. ఉదయం 8 అవకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు భయపడి జనాలు బయట అడుగు పెట్టేందుకు కూడా ధైర్యం చేయడం లేదు.
భానుడు విధించిన కర్ఫ్యూకు.. భాగ్యనగరం రోడ్లన్నీ బోసిపోతున్నాయ్. ఎండలు బాబోయ్ ఎండలు అంటూ జనాలు అల్లాడుతున్న వేళ.. వాతావరణ శాఖ చెప్పిన ఓ వార్త.. మరింత మంట రేపుతోంది. అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఏటా జూన్ ఒకటో తేదీకి అటు ఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయ్. ఏడో తేది నాటికల్లా నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవుతుంటాయ్. అప్పటి నుంచి వర్షాకాలం ప్రారంభంగా లెక్కేస్తారు. వ్యవసాయ దేశమైన భారత్‌లో నైరుతి తెచ్చే వర్షాలే కీలకం.
ఐతే ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని ఇప్పటికే వాతావరణ విభాగం అంచనా వేసింది. ఐతే మరికొందరు మాత్రం రుతుపవనాలు జూన్ 8న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజులకు అంటే జూన్ 15నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రోహిణి కార్తె రావడానికి ముందు ఎండలు ప్రాణం తీసినంత పనిచేస్తున్నాయ్. అలాంటిది ఈసారి రుతుపవనాలు ఆలస్యం అంటుండడంతో.. భానుడి మంటలు మరిన్ని రోజులు భరించాలా అని జనాలు భయపడిపోతున్నారు.