MARRIAGE TROUBLES: పెళ్ళిళ్ళకు కోడ్ కష్టాలు! ఫంక్షన్ హాల్స్ దొరకట్లేదు !!

కోడ్ అమలుతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం కష్టమవుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి నగరాల్లో పెళ్ళిబట్టలు, బంగారం లాంటివి కొనడానికి పోలీస్ చెక్ పోస్టుల నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 01:59 PMLast Updated on: Nov 15, 2023 | 3:21 PM

Marriage Troubles Facing People Due To Election Code And Political Campaigns

MARRIAGE TROUBLES: కార్తీక మాసం వచ్చేసింది. దాంతో నవంబర్ 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ సందడి మొదలైంది. కానీ తెలంగాణలో ఎన్నికల కోడ్ కష్టాలు వెంటాడుతున్నాయి. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు తల్లిదండ్రులకు ఈ ఎన్నికల కోడ్‌తో ఇబ్బందులు తప్పడం లేదు. కోడ్ అమలుతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం కష్టమవుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి నగరాల్లో పెళ్ళిబట్టలు, బంగారం లాంటివి కొనడానికి పోలీస్ చెక్ పోస్టుల నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

IT RAIDS: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహితులపై ఐటీ సోదాలు.. రూ.12.5 కోట్లు స్వాధీనం..

నవంబర్ 16 నుంచి పెళ్ళి శుభ ముహూర్తాలు ఉండటంతో రాష్ట్రంలో వేలల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు నెల ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. పెళ్లికి కావాల్సిన సామగ్రి ఇప్పటికే కొనాల్సి ఉంది. అందుకోసం పక్కనున్న నగరాలకు వెళ్ళాలంటే రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. ఓ మాదిరి దర్జాగా పెళ్ళి చేయాలంటే బట్టలు, బంగారం, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. వంట సామాన్లకు‌ రూ.5 లక్షల పైనే ఖర్చు అవుతుంది. కానీ అంత మొత్తం డబ్బులు తీసుకెళ్ళడం కష్టం. ఆన్‌లైన్‌లో పంపాలన్నా రోజువారీ లిమిట్స్ ఉంటోంది. ఇంకా కల్యాణమండపం, డెకరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులకు డబ్బులు ఇవ్వడం కూడా కష్టమవుతోంది. వంట మనుషులు కూడా ఎక్కడా దొరకడం లేదు. రాజకీయనేతలు తమ వెంట వచ్చే కార్యకర్తలకు అన్నం, బిర్యానీలు, టీలు, టిఫిన్లు లాంటివి అందిస్తున్నారు. దాంతో వంట మనుషుల్లో చాలామంది ఈ పొలిటికల్ లీడర్ల దగ్గర ఎంగేజ్ అయ్యారు.

Prabhas: తగ్గేదేలే.. ప్రభాస్-మారుతి సినిమాకు షాకింగ్ బడ్జెట్..!

నేతల బహిరంగ సభలతో ఫంక్షన్ హాళ్ళు, టెంట్ సామాన్లు, వంట మనుషులే కాదు.. మినరల్ వాటర్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. కొందరు వంట వాళ్ళయితే పెళ్ళికి లక్ష నుంచి రెండు లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారు. అడ్వాన్స్ ఇస్తేనే వస్తామని చెప్పడంతో ఆన్‌లైన్‌లో వాళ్ళు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. పెళ్ళిళ్ళకు, రిసెప్షన్స్‌కి ఫంక్షన్ హాల్స్ దొరకడం లేదు. ఎన్నికల సీజన్ వల్ల నగరాల్లో పొలిటిల్ లీడర్లు తమ పార్టీల సభలు, ఆత్మీయ సమ్మేళనాల కోసం హాల్స్ బుక్ చేసుకున్నారు. దాంతో పెళ్ళిళ్ళు చేసుకునేవారికి.. హాల్స్ నిర్వాహకుల నుంచి ఖాళీ లేవనే సమాధానం వస్తోంది. దాంతో వధూవరుల జాతకాలతో మంచి ముహూర్తాలు ఉన్నా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పెళ్ళిళ్ళను మూడు నాలుగు రోజులు జరుపుకోవాలని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క రోజుకే కుదించుకుంటున్నారు. ఇప్పటికే నగదు, బంగారం సీజ్ అవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. అధికారులేమో సరైన డాక్యుమెంట్స్ సమర్పించాలని కోరుతున్నారు. కానీ సీజ్ అయిన నగదు చేతికి రాక పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు ఎలా చేయలో తెలియక జనం కష్టాలు పడుతున్నారు.