Maruti Suzuki Swift 2024: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్.. ఫీచర్లివే..

దీని ఇంటీరియర్‌కు భారీ మార్పులు చేశారు. ఓవర్సీస్‌లో కొత్త స్విఫ్ట్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కొత్త 9 అంగుళాల టచ్‌స్క్రీన్ కూడా ఉన్నాయి. అయితే రాబోయే ఇండియన్ మోడల్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 06:33 PMLast Updated on: Nov 16, 2023 | 6:33 PM

Maruti Suzuki Swift New Model Will Launch In 2024 Expected Mileage Features

Maruti Suzuki Swift 2024: మారుతి సుజుకి కార్లలో స్విఫ్ట్‌కు ఉన్న డిమాండే వేరు. ఈ కంపెనీ నుంచి వచ్చిన సక్సెస్‌ఫుల్ మోడల్స్‌లో ఇదీ ఒకటి. మారుతి సుజుకి నుంచి కొత్త స్విఫ్ట్ వచ్చే ఏడాది రానుంది. కొత్త మోడల్‌లో దాని స్టైల్‌లో మార్పుతో పాటు, సమర్థత పరంగా కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని కంపెనీ భావిస్తోంది. దీనికి కారణం కొత్త జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందడమే. ఇది ప్రస్తుత స్విఫ్ట్ కంటే మెరుగైన మైలేజీతో వస్తుంది. అంతకంటే పవర్‌ఫుల్ కూడా. పెట్రోల్ ఇంజిన్‌తో ఇది దాదాపు 100 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఈ కొత్త ఇంజన్‌ను పొందిన మొదటి మారుతి కారు ఈ స్విఫ్ట్‌నే. అయితే తర్వాత దీన్ని ఇతర కార్లలో కూడా చూడవచ్చు. దీని మైలేజ్ లీటరుకు 24 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

SCHOOL TEACHERS : స్కూల్లో తన్నుకున్న టీచర్లు… ఏడుగురికి గాయాలు !

రెండో మార్పు.. దీని ఇంటీరియర్‌కు భారీ మార్పులు చేశారు. ఓవర్సీస్‌లో కొత్త స్విఫ్ట్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కొత్త 9 అంగుళాల టచ్‌స్క్రీన్ కూడా ఉన్నాయి. అయితే రాబోయే ఇండియన్ మోడల్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఇది కాకుండా కొత్త స్విచ్‌గేర్‌తో పాటు ఇందులో అందించిన మెటీరియల్ నాణ్యత మరింత ప్రీమియంగా ఉండనుంది. కానీ ఇందులో 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే లుక్ కూడా లేయర్డ్‌గా ఉంటుంది. కొత్త మారుతి స్విఫ్ట్‌లో మెరుగైన సౌకర్యం కోసం కొత్త సీట్లు అమర్చారు. ధర ప్రభావం కారణంగా హైబ్రిడ్ స్విఫ్ట్‌కు బదులుగా, ప్యూర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన మోడల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. కొత్త స్విఫ్ట్ ప్రస్తుత స్విఫ్ట్ కంటే కొంచెం ఎక్కువ ధరతో రానుందని అంచనా. ఇది మార్పులకు అనుగుణంగా ఉంటుంది.

మరోవైపు భారతదేశంలో 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో దూసుకుపోతుంది. కేవలం ఏడు నెలల్లోనే ఈ కొత్త ఎస్‌యూవీ మోడల్‌కు సంబంధించిన 75,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ విజయవంతం అయింది.