southern Mexico: మొసలిని పెళ్లాడిన మేయర్.. తమ ప్రాంతానికి అదృష్టంగా భావించిన స్థానికులు..

పెళ్లి చేసుకోవడం మానవ జీవనంలో సహజమైన క్రియ. ఈ తంతు ద్వారా ఒక జంట సరికొత్త జీవనానికి శ్రీకారం చుడుతుంది. ఒకరికి ఒకరు తోడు నీడలా కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ సంసారాన్ని సాగిస్తారు. ఇదంతా మనుషుల మధ్య జరిగే వేడుక. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక జంతువుకు మరొక రకం జంతువులకు కలిపి పెళ్లిల్లు చేస్తారు. అంతేకాకుండా ఒకే జాతికి చెందిన పశువులకు పెళ్లిళ్లు చేయడం చూసే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు పడటం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం గమనింస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పుకున్నంత వరకూ బాగానే ఉంది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా జరిగితే.. మరికొన్ని వాతావరణ ప్రభావం వల్ల జరిగాయి. కానీ ఇక్కడ రెండు వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో వివాహాన్ని నిర్వహించారు. అది కూడా స్త్రీపురుషులకు కాదు. మరి ఎవరికీ అనే సందేహం మీలో కలుగవచ్చు. ఒక మగాడికి ఆడ మొసలితో పరిణయం చేశారు. షాకింగ్ గా ఉంది కదూ. అవును ఇది నిజం. ఎక్కడ.. ఎందుకు ఇలా చేశారు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2023 | 07:00 PMLast Updated on: Jul 02, 2023 | 7:00 PM

Mayor Victor Hugo Sosa Who Married A Crocodile In Southern Mexico

అది మెక్సికో నగరం. ఇక్కడి ఓప్రాంత మేయర్ కు ఆడ మొసలితో వివాహం జరిపించారు స్థానికులు. దీనికి కారణం చొంటల్, హువే అనే ఇరు సమూహాల మధ్య ఎలాంటి పొర పొచ్చులు, విభేదాలు తలెత్తకూడదని ఈ చర్యకు పాల్పడ్డారు. దక్షిణ మెక్సికోలోని విక్టర్ హ్యూగో సోసా అనే మేయర్ శాంతి నెలకోల్పాలనే ఉద్ధేశ్యంతో అలీసియా అడ్రియానా అనే ఆడమొసలితో పెళ్లికి సిద్దమయ్యారు. ఇది సుమారు 230 ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయంగా తెలిపారు. అందుకే ఈ ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తామన్నారు. ఈ రకంగా పెళ్లి చేసుకోవడం వల్ల తమ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టం కలిసి వస్తుందని వీరి నమ్మకం.

ఇక పెళ్లి కొడుకుకు చొంటల్ రాజుగా ఈ మొసలిని రాణిగా భావిస్తారు. పెళ్లికి ముందు ఈ మొసలిని స్థానికులు తమ ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఒక నృత్యాన్ని చేస్తారు. ఆ తరువాత పెళ్లి వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన మొసలి నోటికి దారంతో కడతారు. నోరు తెరువకుండా ఉండేందుకు భద్రత దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ప్రాంతంలోని మత్యకారులు వలలను పట్టుకొని చిందులు వేస్తారు. చివరిగా పెళ్లి కొడుకు మొసలిని ఎత్తుకొని అంటే స్వయంగా వధువును ఎత్తుకున్నట్లు భావించి డ్యాన్స్ చేస్తారు. ఆ తరువాత దాని నుదుటిపై ముద్దుపెడతారు. ‘మేం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం.. నేను నా భార్యపట్ల మంచిగా పూర్తి బాధ్యతతో మెలుగుతాను’ అని మేయర్ సోసా తెలపడంతో ఈ వేడుక ముగుస్తుంది.

T.V.SRIKAR