Meharin : పెళ్లి కాకుండానే తల్లి కావాలనే కోరిక
పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడు ఓ డేరింగ్ స్టెప్‌తో హాట్‌టాపిక్‌గా మారింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ పాలబుగ్గల సౌందర్యం.. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకొని మరో షాక్ ఇచ్చింది.
పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడు ఓ డేరింగ్ స్టెప్‌తో హాట్‌టాపిక్‌గా మారింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ పాలబుగ్గల సౌందర్యం.. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకొని మరో షాక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త తన అసలైన రూపులోకి వస్తుంది అనుకుంటున్న టైమ్‌లో ఓ షాకింగ్ న్యూస్ షేర్ చేసుకొని మరో సారి న్యూస్‌లో హెడ్‌లైన్‌గా నిలిచింది. పెళ్లికాకుండానే తల్లి కావాలని తపన పడింది. తాను ఎగ్ ఫ్రీజింగ్ (Egg freezing) చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) స్వయంగా తెలిపి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చింది.
ఎగ్ ఫ్రీజింగ్ అన్నది కొత్తేమీ కాదు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మెహ్రీన్ కూడా చేరిపోయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దానికి ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ కామెంట్ చేసింది. ‘నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారి కోసం నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
స్త్రీ యొక్క ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకునే ప్రక్రియనే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. గర్భధారణను వాయిదా వేయడానికి ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. పిల్లలను కనాలి అనుకున్నప్పుడు భద్రపరిచిన ఎగ్స్ ను కరిగించి, ఫలదీకరణం చేసి, పిండాలుగా గర్భాశయానికి బదిలీ చేస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మెహ్రీన్ కూడా చేరింది. వివాహం కాకుండానే ఆమె తన ఎగ్స్ ను భద్రపరుచుకుంది. అంతేకాకుండా తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెహ్రీన్ పంచుకుంది. తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీలో తోడుగా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ మరియు నిరంతరం తన పక్కనే ఉన్న అమ్మకు ధన్యవాదాలు అంటూ మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో మెహ్రీన్ లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.