Chamayavilakku Beauty: ఈమె అందానికి ఇంటర్నెట్ ఫిదా.. అసలు ఎవరీ అమ్మాయి ?
ఆ ఫొటోలో ఉంది అమ్మాయి కాదు. అమ్మాయి వేశంలో ఉన్న అబ్బాయి. ఇతని డిటెయిల్స్ తెలియకపోయినా ఫొటో మాత్రం రెండు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది.

రెండు రోజుల నుంచి ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ అమ్మాయే కనిపిస్తోంది. ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలా అన్ని సోషల్ సైట్స్‌లో ఈ అమ్మాయి అందం గురించే డిస్కర్షన్ నడుస్తోంది. అసలు అన్నం తింటుందా.. అందం తింటుందా, ఇంత అందంగా ఉందేంటి అని యూత్ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఎవరు ఈ అమ్మాయి, అక్కడ జరుగుతున్న ఫెస్టివల్ ఏంటి ? ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
కేరళలోని కొల్లాం డిస్ట్రిక్ కట్టంకూలంగరలో ప్రతీ ఏటా కొట్టంకూలంగర చమయవిళక్కు జాతర ఇది. దేవీ ఆలయంలో జరిగే ఈ జాతరకు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చమని అమ్మవారికి మొరపెట్టుకుంటారు. కోర్కెలు తీరినవారు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతీ ఏడు జరిగే ఈ జాతరలో మరో వింత సాంప్రదాయం కూడా ఉంది. జాతరకు వచ్చే అబ్బాయిలు అమ్మాయిల్లా మారిపోతారు. అంటే జెండర్ మారిపోవడం కాదండోయ్.. డ్రెస్సింగ్ మారిపోవడం. అబ్బాయిలంతా అమ్మాయిల గెటప్‌లో ఇక్కడికి వస్తారు. తమకు నచ్చిన డ్రెస్సింగ్‌లో, మేకప్ వేసుకుని అమ్మాయిల్లా రెడీ అవుతారు. ఎవరు ఎక్కవ అందంగా తయారయ్యారు అనే విషయంలో ఇక్కడ అందాల పోటీలు కూడా జరుగుతాయి.
అలా అందాల పోటీలో తలుక్కుమన్నాడు నిన్నటి నుంచి వైరల్ అవుతున్న మన ఈ హీరో. అవును మీరు విన్నది నిజమే. ఆ ఫొటోలో ఉంది అమ్మాయి కాదు. అమ్మాయి వేశంలో ఉన్న అబ్బాయి. ఇతని డిటెయిల్స్ తెలియకపోయినా ఫొటో మాత్రం రెండు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. ఇతను మాత్రమే కాదు. అలా అమ్మాయిల గెటప్‌లో జాతరకు వచ్చిన చాలా మంది వీడియోస్, ఫొటోస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. వాళ్లను నిజంగానే అమ్మాయిలు అనుకుని కొందరు, ట్రాన్స్ పీపుల్ అనుకుని కొందరు తెగ షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఇతను అబ్బాయి అయినా.. అందాల పోటీలో ఆడపిల్లగా నెగ్గి రెండు రోజుల నుంచి టాక్‌ఆఫ్ ది ఇంటర్నెట్‌గా మారిపోయాడు.