Doctors are Gods: తెగిన తలను అతికించారు.. ఇందుకే కదా డాక్టర్లను దేవుళ్లు అనేది..!!
ఓ రోజు సైకిల్ మీద షికారు కొడుతుండగా సులేమాన్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సులేమాన్ మెడ, పొత్తికడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. స్కాన్ చేసిన తరువాత సులేమాన్ పరిస్థితి చేదాటిపోయిందని డాక్టర్లు చెప్పారు.
వైద్యశాస్త్ర చరిత్రలో ఇదో అద్భుతం. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి.. ఓ పిల్లాడికి పునర్జన్మనిచ్చారు ఇజ్రాయెల్ డాక్టర్లు. శరీరం నుంచి వేరైన తలను తిరిగి అతికించి చరిత్ర సృష్టించారు. ఇజ్రాయెల్ డాక్టర్లు సాధించిన ఈ ఘనతకు ప్రపంచమే దాసోహమైంది. జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ అనే 12 ఏళ్ల అబ్బాయికి జరిగింది ఈ ఆపరేషన్. సులేమాన్‌కు సైకిల్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి వచ్చిన తరువాత సైకిల్‌పై తమ వ్యాలీ మొత్తం తిరిగేవాడు. ఓ రోజు సైకిల్ మీద షికారు కొడుతుండగా సులేమాన్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సులేమాన్ మెడ, పొత్తికడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. స్కాన్ చేసిన తరువాత సులేమాన్ పరిస్థితి చేదాటిపోయిందని డాక్టర్లు చెప్పారు. తలతో వెన్నెముకను కలిపి ఉంచే భాగం వేరయ్యిందని చెప్పారు.
సులేమాన్‌ను హదస్సాలోని ఈన్ కెరెమ్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అక్కడ డాక్టర్ ఓహాద్ ఈవాన్ సులేమాన్ కేసును టేకప్ చేశారు. బాలుడి పరిస్థితిపై తన ట్రామా ఆర్థోపెడిక్ టీంతో కలిసి రివ్య్యూ చేశారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. కొన్ని గంటల పాటు శ్రమించిన తరువాత వెన్నెముకను తలను కలిపిఉంచే లెజిమెంట్‌ను తిరిగి అతికించగలిగారు. ఈ ఆపరేషన్‌కు సాంకేతికతతో పాటు డాక్టర్ ఈవాన్ సుదీర్ఘ అనుభవం ఎంతో తోడైంది. కొన్ని నెలల్లోనే సులేమాన్ తిరిగి నిలబడగలిగాడు. మృత్యుఒడిలో ఉన్న బాలుడి ప్రాణాన్ని తమ నైపుణ్యంతో కాపాడిన డాక్టర్ ఈవాన్‌ను ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు మెచ్చుకుంటున్నారు. శరీరం నుంచి విడిపోయిన తలను తిరిగి అతికించడం అంటే సులేమాన్‌కు ఇది నిజంగా రెండో జన్మే. ఆ జన్మకు డాక్టర్ ఇవాన్ మాత్రమే దేవుడు.