మోనాలిసా యూట్యూబ్ క్రేజ్; అంట్లు కడిగే వీడియోకు 12 లక్షలు, రోటీ వీడియో 15 లక్షల వ్యూస్

కుంభమేళాలో మోనాలిసా ఒక సెన్సేషన్. ఆమెకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆమెకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 10:42 AMLast Updated on: Jan 28, 2025 | 10:42 AM

Mona Lisa Youtube Craze 12 Lakhs For Washing Video 15 Lakhs For Roti Video

కుంభమేళాలో మోనాలిసా ఒక సెన్సేషన్. ఆమెకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆమెకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆమె కళ్ళకు యూత్ ఫిదా అయిపోయారు. హీరోయిన్లకు మించి ఆమె అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేషనల్ మీడియా కూడా ఆమెపై ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా మోనాలిసా విషయంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేసి వీడియోలు చేస్తోంది.

ఇక ఆమె ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఇదే టైం లో ఈ క్రేజ్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. కుంభమేళాలో పూసలు, బ్యాగులు అమ్ముకోవడానికి వెళ్ళిన మోనాలిసా అక్కడ బిజినెస్ కంటే తనతో ఫోటోలు దిగే వారు ఎక్కువగా ఉండటంతో ఇక ఆమె తండ్రి జాగ్రత్తపడ్డాడు. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇదే టైంలో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను మణిపూర్ బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాలో తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.

అవసరమైతే ఆమెకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మోనాలిసా క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. తన తమ్ముడి చదువు కోసం మహా కుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వెళ్లిన మోనాలిసాపై ఎన్నో కథనాలు కూడా వచ్చేసాయి. ఇక ఆమె కనపడితే సెల్ఫీలు అంటూ ఆకతాయిలు ఆడుకోవడంతో ఆమె భద్రతపై కూడా ఆందోళన మొదలైంది.

దీనితో ఇంటికి వెళ్లిపోయిన మోనాలిసా తాను ఏం చేస్తున్నానో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టింది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మోనాలిసా ఏకంగా రెండు రోజులలోనే రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించింది. ఎనిమిది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆమె భారీ వ్యూస్ తో సెన్సేషన్ అవుతుంది. గత నాలుగు రోజుల నుంచి అప్లోడ్ చేసిన వీడియోలు భారీ వ్యూస్ వచ్చాయి. ఆమె రోటి చేసే వీడియోకు 15 లక్షల వ్యూస్ రాగా ఆమె అంట్లు కడిగే వీడియోకు 12 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఇక తన ఇంస్టాగ్రామ్ ఐ డి ఏంటో చెప్తూ చేసిన వీడియోను 1.6 లక్షల మంది చూశారు. ఇక తన ఇంటిని చూపిస్తూ చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు యూట్యూబ్లో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కొంత మంది నానా కష్టాలు పడుతుంటారు. కానీ ఆమె మాత్రం యూట్యూబ్లో దుమ్ము రేపుతుంది. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆమె ఒక సెన్సేషన్ అయిపోయింది.