Earth: భూమి చుట్టూ కొత్త చంద్రుడు.. ఇది దేనికి సంకేతం ?

చిన్నప్పుడు చదువుకున్నాంగా.. సూర్యుడి చుట్టూ భూమి.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతారని ! భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 4, 2023 | 02:55 PMLast Updated on: Jun 04, 2023 | 3:26 PM

Moon Around Earth What Is The Reason

సృష్టి ఆరంభం నుంచి ఇదే జరుగుతోంది. ఐతే ఖగోళంలో ఇప్పుడో వింత కనిపెట్టారు సైంటిస్టులు. భూమి చుట్టూ కొత్త చంద్రుడు తిరుగుతున్నట్లు చెప్పారు. చంద్రుడు అంటే చంద్రుడు కాదు.. చంద్రుడిలాంటిది అన్నమాట ! భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడిలాంటి మరో వస్తువును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కొత్త చంద్రుడిని పాక్షిక చంద్రుడు అని పిలుస్తారు. ఇది ఒక గ్రహశకలంలాంటిది. ఇది సూర్యుని వైపు లాగడంతో పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. హవాయిలోని టెలిస్కోప్‌ను ఉపయోగించి 2023 FW13 అని పిలిచే ఈ పాక్షిక చంద్రుడిని కనిపెట్టారు.

ఇది చాలాకాలం పాటు భూమి చుట్టూ ఉంది. దీని మూలాలు క్రీస్తు పూర్వం 100నుంచి ప్రారంభం అయ్యాయ్. ఇది క్రీస్తు శకం 3700 వరకు.. అంటే దాదాపు మరో 15వందల ఏళ్ల వరకు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత అది భూమి కక్ష్యను విడిచిపెడుతుంది. ఐతే దాని నుంచి భూమికి ఎలాంటి ప్రమాదం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. పాక్షిక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. నిజానికి ఇది భూమికి బదులు సూర్యుని గురుత్వాకర్షణతో కట్టుబడి ఉంటుంది. అందుకే దీన్ని క్వాసి అంటారు.

భూమి చుట్టూ కొండగోళం అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ బలంగా ఉంటుంది. అది ఉపగ్రహాలను తన వైపుకు లాగుతుంది. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త చంద్రుడి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫన్నీ కామెట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు నెటిజన్లు. ఆ చంద్రుడికి.. ఈ చంద్రుడు కజిన్‌ బ్రదరా.. లేదంటే ఇద్దరు ట్విన్సా అంటూ జోకులు వేస్తున్నారు. ఏమైనా కొత్త చంద్రుడితో… నింగికి, నేలకి ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు అనే మాట ఓ 15వందల ఏళ్లు చెల్లదేమో..