Chandrayaan 3: చంద్రయాన్-3 కథ ఇక ముగిసినట్టే.. ఇస్రో మాజీ చైర్మన్ కీలక ప్రకటన..
చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట. చంద్రుడి సౌత్ పోల్‌లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపేశారు శాస్త్రవేత్తలు.
Chandrayaan 3: చంద్రయాన్-3లో వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ఉన్న ప్రాంతంలోకి వెలుతురు వచ్చి దాదాపు రెండు వారాలు గడుస్తోంది. కానీ ఇప్పటికీ అక్కడి నుంచి నో రెస్పాన్స్. చంద్రయాన్-3 పని ఇక అయిపోయినట్టేనా..? ప్రగ్యాన్, విక్రమ్ ఇక పని చేయవా..? ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఉన్న ప్రశ్నలు ఇవే. అవును.. చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట.
చంద్రుడి సౌత్ పోల్‌లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపేశారు శాస్త్రవేత్తలు. మరో 14 రోజుల పాటు అక్కడ వెలురుతు ఉండే చాన్స్ లేకపోవడంతో రెండు మాడ్యూల్స్‌ను ఆఫ్ చేశారు. నిజానికి ఆ 14 రోజులు పరిశోధన కోసం మాత్రమే చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించారు. కానీ అవి సోలార్ సిస్టమ్‌తో పనిచేసే వ్యవస్థలు కావడంతో.. సౌత్ పోల్‌లో వెలుతురు వచ్చిన తరువాత మళ్లీ ప్రగ్యాన్, విక్రమ్ పని చేస్తాయని అంతా అనుకున్నారు. ఆ రెండిటినీ నిద్ర లేపేందుకు చాలా రోజుల నుంచి శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. కానీ వాటి నుంచి నో రెస్పాన్స్. ఒకవేళ అవి పని చేసేలా ఉంటే ఇప్పటికే వాటి నుంచి ఏదో ఒక రెస్పాన్స్ వచ్చి ఉండాలి. కానీ ఇప్పటికే కనీసం సిగ్నల్ కూడా రాలేదు. దీంతో ఇక వాటి అధ్యాయం ముగిసినట్టే అని చెప్తున్నారు కిరణ్ కుమార్.
ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్‌ను ప్రగ్యాన్, విక్రమ్ పంపించాయి. ఇవి భవిష్యత్తులో మూన్ మిషన్స్‌కు ఎంతగానో యూజ్ అవుతాయి. ఒకవేళ మరోసారి ఈ రెండు పని చేసి ఉంటే.. చంద్రుడి గురించి మరి కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరికి ఉండేది. కానీ ఇప్పుడు అవి పరిశోధనలు కాదుకదా.. పని చేసే స్థితిలో కూడా లేవు. ఫ్యూచర్‌లో యాక్టివేట్ అవుతాయో లేదో కూడా తెలియదు. దీంతో ఇక చంద్రయాన్-3 మిషన్ కంప్లీట్ అయినట్టే అని చెప్తున్నారు కిరణ్ కుమార్.