Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రత్యేక కథనం

పుట్టిన పిల్లవాడు పసితనంలో మాట్లాడే భాషను పసిపిల్లల మాటలు పిల్లల భాష అంటారు. పెరిగే కొద్దీ తల్లితో మమేకం ఏర్పడుతుంది. అప్పుడు పిల్లవాడు తనకు కావల్సిన అవసరాన్ని తీర్చుకునేందుకు తన భావాన్ని తల్లితో పంచుకుంటాడు. అలా పంచుకునేందుకు ఒక వారధి కావాలి. ఆ వారధినే మాతృభాష అంటారు. తల్లికి పిల్లవాడికి మధ్య జరిగే సంభాషణే ఇది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2023 | 01:25 PMLast Updated on: Feb 21, 2023 | 1:25 PM

Mother Language Day Special Story

ఈ మాతృభాష కోసం అనేక ఉద్యమాలే జరిగాయి. మన దేశంలో కూడా తమిళ రాష్ట్రంలో ద్రవిడభాషా ఉద్యమం జరిగింది. మనం తెలుగు వారిగా మద్రాసు నుంచి విడిపోవడానికి.. మన భాష తెలుగును కాపాడుకునేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నాం. దీనికై పోట్టి శ్రీరాములు నిరివధిక ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను ప‎ణంగా పెట్టారు. అప్పుడు ఏర్పడింది తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం. దీంతో కొన్నేళ్ల తరువాత తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. ఇక్కడ కూడా భాషా ప్రతిపదికన ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ నినిదాలు గట్టిగా వినిపించారు. దీంతో ప్రత్యేక తెలంగా‎ణ రాష్ట్రం ఏర్పడింది. ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక్కో భాష ప్రధానంగా ఉండేది. వీటన్నింటిలో కొన్ని భాషలను ప్రభుత్వం అధికారిక భాషలుగా గుర్తించింది. అందుకే ప్రతి కరెన్సీ నోటు మీద పలు రాష్ట్రాల భాషలను ముద్రిస్తుంది.

ఇలా పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా ప్రతిదేశం వారు తమ తమ ప్రాంతీయ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాలని కోరింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది. అలా విడిపోయిన భాగంలో కొంతభాగం తూర్పు పాకిస్తాన్ గా మరికొంత భాగం పశ్చిమ పాకిస్తాన్ రెండు భాగాలుగా చీలిపోయింది.

ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ వారు ఉండే వారు. పశ్చిమ పాకిస్తాన్ లో అప్పటికీ, ఇప్పటికీ పాకిస్తానీయులే నివసిస్తున్నారు. 1948 లో పాకిస్తాన్ నుంచి వేరు అవ్వాలనే ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ వారు ఉద్యమాన్ని నడిపారు. అక్కడ చాలా మంది ప్రజలు బెంగాలీ మాట్లాడేవారు. కొందరు ఉర్ధూ కూడా మాట్లాడేవారు. దీంతో 1952లో ర్యాలీలో పాల్గొని బెంగాలీని, ఉర్ధూని అధికార భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆ ఉద్యమం కొన్ని సంవత్సరాలకు 1971లో ఇందిరాగాంధీ హయాంలో ప్రత్యేక దేశంగా విభజించబడింది. దీంతో తమకు స్వేచ్ఛ వచ్చి ప్రత్యేకభాషను ఏర్పాటు చేసుకున్నారు బంగ్లాదేశీయులు. అందుకు ప్రతీదిగా ప్రతి ఏటా అంతర్జాతీయ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. అప్పుడు యునెస్కో ఈ అంశాన్ని గుర్తించి 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా అన్ని దేశాలు జరుపుకోవాలని ప్రకటించింది. అయితే 2000 ఫిబ్రవరి21 నుంచి ప్రతిసంవత్సరం జరుపుకోవాలని యునెస్కో తెలిపింది. దీంతో ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

indian mother tungs

Indian Mother Languages

ఈ మాతృభాషను ప్రతిఒక్కరిలో సంపూర్ణంగా అవలంభింపజేయాలంటే కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు చేపట్టాలి. పిల్లలకు పసి వయస్సు నుంచే ఇంట్లో తమ సొంత భాషను వాడుతూ వారితో మాట్లాడిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఇంట్లో నేర్పన భాష పిల్లలు సమాజంలోకి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కొందరి ఇళ్లలో అయితే రెండు మూడు భాషలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ రెండు మూడు భాషలపై పిల్లలు చిన్న తనంనుంచే పట్టు సాధించడం వల్ల రేపు భవిష్యత్తులో ఏరాష్ట్రానికి వెళ్ళైనా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ఇలా చేయడం వల్ల మన మాతృభాష అంతరించి పోకుండా భావితరాలకు బహుమతిగా ఇచ్చిన వాళ్శం అవుతాం.

ఇప్పటి ఆధునిక యుగంలో ప్రతి విషయం ఆంగ్లానికే పరిమితం అవుతుంది. ఇది లేనిదే భవిష్యత్ లేదు అనేలా మారిపోయింది కాలం. దీనికి కారణం మనలోపమే. మనం పరభాషను ప్రేమించాలి. అలాగే మన మాతృభాషను ప్రోత్సహించాలి. తమిళనాడులో వారు భాషకు ఇచ్చినంత ప్రాధాన్యం మరి వేరొక దానికి ఇవ్వరు. కనీసం షాపు ముందు బోర్డు నుంచి అన్ని తమిళ అక్షరాల్లోనే ఉంటాయి. అలాగని తమిళనాడు ఏమి అంత వెనుకబడిపోలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భాష ఏదైనా కోరేది భావమే. మనకు ఏభాష వచ్చు అనేది కాదు ఇతరులతో సంభాషించేటప్పుడు అలవోకగా ఎందులో మాట్లాడాము అనేది ప్రధానం.

అమ్మచేతి ముద్ద, ఆవకాయ బద్ద, అరిటాకు భోజనం ఎంత కమ్మగా ఉంటాయో అంతకు మించిన కమ్మని భావాన్ని అందిస్తుంది మాతృభాష.

 

 

 

T.V.SRIKAR