Movie Songs: పెళ్లిళ్లలో సినిమా పాటలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో పాటలు పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. పెళ్లిళ్లలో సినిమా పాటల ప్రదర్శన, పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.
Movie Songs: పెళ్లిళ్లలో సినిమా పాటలు వినిపించడం, సినిమా టైప్ సీన్లు కనిపించడం కామన్. పాటలు పాడటం, డ్యాన్స్‌లు చేయడం ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఐతే ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది అనుకోండి..! దీనిపై సినిమా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ తమ పాటలు పాడుతూ, ప్రదర్శిస్తూ ఉంటే.. ఎంతో కష్టపడి రూపొందించిన తమకు ఉపయోగం ఏంటని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
అంతే కాదు వీటిపై కాపీరైట్ ఉల్లంఘన చట్టాన్ని అమలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో కాపీరైట్ ఉల్లంఘన చట్టాల బారి నుంచి తమను రక్షించాలని ఈవెంట్ల నిర్వాహకులు కోరుతున్నారు. అసలు పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో పాటలు పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. పెళ్లిళ్లలో సినిమా పాటల ప్రదర్శన, పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. వీటిని కోర్టుల్లో సవాల్ చేయలేరని తెలిపింది. పెళ్లి, ఇతర వేడుకల్లో పాటలను ప్లే చేయడం వల్ల కాపీరైట్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వివాహ కార్యక్రమాలలో హిందీ సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీ వసూలు చేయడంపై అనేక ఫిర్యాదులకు రియాక్షన్‌గా ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిర్వాహకులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. పాట లేకపోతే మూడ్ క్రియేట్ కాదు.. ఆ మూడ్ క్రియేట్ కాకపోతే.. ఈవెంట్, ఈవెంట్‌లా అనిపించదు.. ఎలా అని అనుకుంటున్న సమయంలో.. ఈ ఆదేశాలు మాంచి ఊపున్న పాట ప్లే చేసినట్లు అయింది.