మయన్మార్….. బ్యాంకాక్… షష్ఠగ్రహ కూటమి ఎఫెక్ట్ మార్చ్ 29న ప్రళయమే ?
మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు సగం నగరం ధ్వంసం అయ్యేంత తీవ్రత. ఈ స్థాయిలో భూకంపం రావడం ఇప్పుడు మరోసారి షష్ఠగ్రహ కూటమి భయాలను తెర మీదకు తెస్తోంది.

మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు సగం నగరం ధ్వంసం అయ్యేంత తీవ్రత. ఈ స్థాయిలో భూకంపం రావడం ఇప్పుడు మరోసారి షష్ఠగ్రహ కూటమి భయాలను తెర మీదకు తెస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకూ లివియథాన్ లేస్తోంది అనే భయం ప్రపంచానికి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు వరుసగా వస్తున్న ఈ ప్రమాదాలు చూస్తుంటో షష్ఠగ్రహ కూటమి వల్ల ఏదో ప్రయళం రాబోతోంది అనే టెన్షన్ చాలా మందిలో మొదలైంది. బ్యాంకాక్‌లో వచ్చిన భూకంపం చిన్నదేం కాదు. 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే.. దానివల్ల జరిగి విధ్వంసం వర్ణనాతీతం. కేవలం బ్యాంకాక్‌లోనే కాదు.. మయన్మార్‌లో కూడా ఇదే స్థాయిలో భూకంపం వచ్చింది. అక్కడి మోనివా నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 50 కిలో మీటర్ల మేర ప్రకంపణలు వచ్చాయి.
ఇక బ్యాంకాక్‌లో అయితే మాండలేలో ఇరావాడి నదిపై ఉన్న ఐకానిక్ బ్రిడ్జ్ కళ్లముందే నేలమట్టం అయ్యింది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. షష్ఠగ్రహ కూటమి వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. షష్ఠగ్రహ కూటమి అంటే.. ఒక నిర్దిష్ట రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు లాంటి ఆరు గ్రహాలు కలసి ఉండటం. ఇది చాలా అరుదుగా జరిగే జ్యోతిష్య సంఘటన, దీన్ని కొన్నిసార్లు అశుభంగా పరిగణిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. ఈ షష్ఠగ్రహ కూటమితోనే ఈ ఉగాది ప్రారంభం కాబోతోంది. మార్చ్ 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదే రోజు ఈ షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది.
ఇలా జరగడం అనేక ప్రమాదాలకు ప్రళయానికి కూడా సంకేతం అనేది చాలా మంది జోతిష్యులు చెప్తున్న మాట. ఈ షష్ఠగ్రహ కూటమి కారణంగానే ప్రంపంచవ్యాప్తంగా పలు విధ్వంసాలు భూకంపాలు వస్తున్నాయి అనేది ప్రజెంట్ గాసిప్. ఒక రకంగా చూస్తే మార్చి 29 తరువాత ఇంతకు మించిన ప్రళయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇవన్నీ వట్టి ఫేక్ ప్రచారాలు అని కొట్టిపారేసే హేతువాదులు కూడా ఉన్నారు. ఈ షష్ఠగ్రహ కూటమి సైన్స్ ప్రకారం మనుషుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు కొందరు వ్యక్తులు. ఇది ఖగోళంలో చాలా తరచుగా జరిగే ప్రక్రియ అంటూ చెప్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ప్రమాద నేపథ్యంలో త్వరలో రాబోతున్న షష్ఠగ్రహ కూటమి తరువాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.