Nagarjuna sagar: సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసుకున్న ఏపీ.. షాకిచ్చిన తెలంగాణ
నీళ్లలో తమకూ వాటా ఉందని చెప్పిన ఏపీ అధికారులు.. డ్యాంకు సంబంధించిన 26 గేట్లలో 13 గేట్లను ఎత్తివేశారు. ఏపీకి నీళ్ల విడుదల చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. తెలంగాణ అధికారులు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Nagarjuna sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకోవడం వివాదాస్పదమైంది. అక్రమంగా ప్రాజెక్టు వద్దకు దూసుకొచ్చిన ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసులు.. తెలంగాణ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. ఏపీ అధికారులు, పోలీసులు కలిపి దాదాపు 500 మంది.. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఒకేసారి పెద్ద ఎత్తున ఏపీ పోలీసులు రావడంతో డ్యాం అధికారులు ఏమీ చేయలేకపోయారు. నీళ్లలో తమకూ వాటా ఉందని చెప్పిన ఏపీ అధికారులు.. డ్యాంకు సంబంధించిన 26 గేట్లలో 13 గేట్లను ఎత్తివేశారు.
Revanth Reddy: కేసీఆర్‌ది దింపుడు కళ్లం ఆశ.. సాగర్ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి
ఏపీకి నీళ్ల విడుదల చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. తెలంగాణ అధికారులు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. గేట్లు ఎత్తిన అధికారులు.. తాత్కాలిక విద్యుత్ ద్వారా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. ఏపీ వైపు వాహనాలకు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరిగింది. ఇప్పటివరకు 2,000 క్యూసెక్కుల నీటి విడుదల జరిగినట్లు తెలుస్తోంది. ఇదే స్థాయిలో ఏపీకి నీటి విడుదల కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు ఏపీకి షాకిచ్చారు.
నీటిని విడుదల చేసేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో ఏపీకి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే, మరో తాత్కాలిక ఏర్పాటు ద్వారా విద్యుత్ సరఫరాకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇంకా నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఈ వివాదం విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవద్దని, నేతలెవరూ మాట్లాడవద్దని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.