Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిపై ట్రోలింగ్.. ఆడుకుంటున్న నెటిజన్లు..
చైనా లాంటి దేశాలతో పోల్చినా.. దేశంలో పని గంటలు తక్కువేనని.. ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్, జర్మన్ జనాలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు.
Narayana Murthy: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్‌పై నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి.. భారతీయల వర్క్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ ఆర్ధిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చని నారాయణ మూర్తి అన్నారు.
చైనా లాంటి దేశాలతో పోల్చినా.. దేశంలో పని గంటలు తక్కువేనని.. ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్, జర్మన్ జనాలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు. నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. నారాయణ మూర్తి వ్యాఖ్యలను చాలామంది ఖండించారు. మరికొందరు విమర్శించారు. మరోవైపు టెక్కీలు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి అభిప్రాయాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. 2005లో ఇన్ఫోసిస్‌లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతం ఏడాదికి మూడున్నర లక్షలుంటే 2023లోనూ అంతే ఇస్తున్నారని, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించి.. దానికంటే 40గంటలు అంకితభావంతో పనిచేస్తామని కొందరు ట్వీట్ చేశారు.
లా బోర్డ్ వారానికి 48గంటలు మాత్రమే పనిచేయాలని చెప్తుంటే.. ఈ 70 గంటల పని ఏంది సార్ అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. నారాయణ మూర్తి కండిషన్‌కు తగినట్లుగా ఉద్యోగులు దొరకడం అంటే అయ్యే పని కాదని.. టార్చ్ లైట్ పెట్టి వెతికినా దొరకరని మరికొందరు కామెంట్ పెడుతున్నారు.