మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్ వ్యోమనౌకను పంపతున్నట్లు నాసా ప్రకటన
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్...అంతరిక్షం నుంచి భూమికి రానుంది. మార్చి మొదటి వారంలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే సేఫ్ తీసుకొచ్చేందుకు నాసా చర్యలు వేగవంతం చేసింది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్…అంతరిక్షం నుంచి భూమికి రానుంది. మార్చి మొదటి వారంలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే సేఫ్ తీసుకొచ్చేందుకు నాసా చర్యలు వేగవంతం చేసింది. వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్‌మోర్…8 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 8 రోజుల మిషన్ కోసం జూన్ 6న ISSకు వెళ్లిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజీ అయింది. దీంతో 8 నెలలుగా అక్కడే గడుపుతున్నారు. నడవటం ఏంటో…కూర్చోవడం అంటే ఎంటో కూడా మర్చిపోయానని సునీతా విలియమ్స్ కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చింది. వారిద్దరు భూమిపైకి తిరిగి రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను భూమిపైకి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు అప్పగించారు. మార్చి మధ్యలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని నాసా ప్రకటించింది.
అటు నాసా అధికారులు, ఇటు స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు…వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్‌మోర్ ను భూమిపైకి తీసుకొచ్చే అంశంలో రోజుకో తేదీని ప్రకటిస్తున్నారు. కచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా…మళ్లీ ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తుతోంది. దీంతో వారి రాక మరింత ఆలస్యం అవుతోంది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగి ఎప్పుడు వస్తారో క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం వీరిద్దరూ షెడ్యూల్ కంటే ముందుగానే భూమిపైకి రావచ్చని తెలుస్తోంది. నాసా ఇటీవల ప్రకటించిన రీషెడ్యూల్ ప్రకారం…అన్నీ సవ్యంగా జరిగితే సునీతా, విల్మోర్ 2025 మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి వస్తారని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములు అంతకంటే ముందుగానే భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ను మార్చి 19 నాటికి తిరిగి భూమికి తీసుకువస్తున్నట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. ఇది గతంలో ప్రకటించిన డెడ్లైన్ కంటే దాదాపు రెండు వారాల ముందుగానే రావొచ్చని అంచనా వేస్తోంది. వ్యోమగాములు షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావడం అనేది స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ కు సంబంధించిన అంశం. వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌ను…గతేడాది సెప్టెంబర్ 29న నాసా ప్రయోగించింది. ఇందులో నాలుగు సీట్లు ఉన్నాయి. హాగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి…మిగిలిన రెండు సీట్లను సునీత, విల్‌మోర్ కోసం ఖాళీగా వదిలిపెట్టారు.
సెప్టెంబరులో ISSతో అనుసంధానమైన ఈ మిషన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం ఆలస్యం అయింది. దీంతో విల్మోర్, విలియమ్స్ భూమికి తిరిగి రావడం వాయిదా పడింది. వ్యోమగాములు 8 నెలలుగా అంతరిక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం, స్పేస్‌ఎక్స్ సహకారంతో సునీతా విలియమ్స్, విల్మోర్ను వీలైనంత త్వరగా భూమికి తీసుకొచ్చేందుకు..నాసా చర్యలు వేగవంతం చేసింది.