Another Planet, Solar System : భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించిన నాసా..
సౌర కుటుంబానికి ఆవతల భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించింది నాసా. దానికి 'కే2-18 బి’ అని పేరు కూడా పెట్టింది. నిజానికి ఈ గ్రహాన్ని 2015లోనే గుర్తించారు. ఓ చిన్నపాటి నక్షత్ర మండలంలోన ఈ గ్రహం తిరుగుతోంది. భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహాంపై చాలా కాలంగా టెలిస్కోప్ ద్వారా ప్రయోగాలు చేస్తోంది నాసా.

NASA has discovered another Earth like planet beyond the solar family It was also named K2 18B In fact this planet was discovered in 2015 itself
భూమి లాంటి మరో గ్రహం..
ఈ అనంత విశ్వంలో భూమి మీద తప్ప మిగతా గ్రహాల మీద జీవం ఉందా.? మానవ నివాసానికి భూమి తప్ప మరో గ్రహం అనుకూలంగా ఆవాసయోగ్యంగా ఉందా.? ఈ విషయం కనుక్కోడానికి చాలా దేశాలు చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇందులో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా..ఓ అడుగు ముందుకు వేసినట్టు కనిపిస్తోంది.
భూమిని పోలిన మరో భూమి..
సౌర కుటుంబానికి ఆవతల భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించింది నాసా. దానికి ‘కే2-18 బి’ అని పేరు కూడా పెట్టింది. నిజానికి ఈ గ్రహాన్ని 2015లోనే గుర్తించారు. ఓ చిన్నపాటి నక్షత్ర మండలంలోన ఈ గ్రహం తిరుగుతోంది. భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహాంపై చాలా కాలంగా టెలిస్కోప్ ద్వారా ప్రయోగాలు చేస్తోంది నాసా. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కే2-18 బి గ్రహాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికిని గుర్తించినట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికి ఆధారంగా ఈ గ్రహం ఉపరితలం కింద మహా సముద్రం ఉండొచ్చని భావిస్తున్నారు.
‘కే2-18 బి’ గ్రహం పై సల్ఫైడ్ ఆనవాళ్లు..
జీవం ఉన్నచోట మాత్రమే ఉత్పత్తయ్యే డిమెథైల్ సల్ఫైడ్ ఆనవాళ్లను కూడా ఈ గ్రహంపై గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఖచ్చితంగా ఈ గ్రహంపై జీవం ఉందని ఆధారం లభించినట్టే. ఒకవేళ అదే నిజమైతే అక్కడున్న జీవులు ఏలియన్సా అనేది ఇప్పుడు బిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలోనే ఉంది నాసా. దాంతో పాటే మనుషులు ఈ గ్రహం నివసించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా బయటికి తెస్తామంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.