Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోలు తీసిన అమెరికా శాటిలైట్‌..

చంద్రుడి దక్షిణ దృవానికి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 3 ల్యాండ్ అయినట్టు ఆ శాటిలైట్‌ గుర్తించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు రోజుల తర్వాత నాసా ఆర్బిటర్లోని కెమెరా దాని ఆబ్లిక్ ఫొటోను తీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 03:43 PMLast Updated on: Sep 06, 2023 | 3:43 PM

Nasas Lro Captures Vikram Lander Landing Site On Moon

Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ స్థలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ గుర్తించింది. దాన్ని ఫొటో తీసి నాసాకు పంపింది. అందులో మన విక్రమ్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రుడి దక్షిణ దృవానికి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 3 ల్యాండ్ అయినట్టు ఆ శాటిలైట్‌ గుర్తించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు రోజుల తర్వాత నాసా ఆర్బిటర్లోని కెమెరా దాని ఆబ్లిక్ ఫొటోను తీసింది.

విక్రమ్‌ ల్యాండింగ్‌ సమయంలో లేచిన మట్టివల్ల విక్రమ్‌ ల్యాండర్‌ చుట్టూ ప్రకాశవంతమైన కాంతివలయం ఏర్పడింది. నాసా తీసిన ఫొటోలో ఈ సర్కిల్‌ క్లియర్‌గా కనిపిస్తోంది. నాసా ఈ ఆర్బిటర్‌ను 2019 జూన్ 18న ప్రయోగించింది. అప్పటి నుంచి అది ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. దాదాపు నాలుగేళ్లుగా జాబిల్లి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని నాసాకు చేరవేస్తోంది. నాసా షేర్‌ చేసిన విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతానికి విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ రెండూ స్లీప్‌ మోడ్‌లో ఉన్నాయి. ఈ నెల 22 తరువాత చంద్రుడి దక్షిణ దృవంపై మళ్లీ కాంతి రాగానే ఇవి పని చేసే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రుడి గురించి మరింత సమాచారం సేకరిస్తుంది ప్రగ్యాన్‌ రోవర్‌.