National Highways: జీపీఎస్ ఆధారంగా ఎంత తిరిగితే అంత ట్యాక్స్ వసూలు..!

నేషనల్ హైవేలకు మహర్థశ పట్టిందని చెప్పాలి. టోల్ గేట్ల వద్ద వాహనాన్ని నిలుపకుండానే జీపీఎస్ ఆధారంగా పన్ను వసూలు చేసే విధానానికి స్వాగతం పలికారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 09:00 AMLast Updated on: Mar 25, 2023 | 9:00 AM

National Highways Latest Technology

నేటి యుగం అంతా మాయ అని చెప్పాలి. నిన్న ఉన్న పరిస్థితులు ఈరోజు ఉండవు. ఈరోజు ఉన్న విధానం రేపు కనుమరుగైపోతుంది. సరిగ్గా ఇదే టోల్ వసూళ్ల విషయంలో జరుగుతుంది. ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద వాహనం నిలబడి ఎక్కడకి వెళ్తున్నాడో కనుక్కొని దానికి సంబంధించిన రోడ్డు వినియోగ ఛార్జీలు వసూలు చేసేవారు. దీనికి కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టేది. ఆపద్దతి కాస్త మారి ఫాస్టాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద వాహనం నిలిపే గరిష్ట సమయం నిమిషానికన్నా తక్కువగా పడిపోయింది.

ఇక ఇప్పుడు మరో ప్రణాళికలను సిద్దం చేయనుంది కేంద్రప్రభుత్వం. అదే జీపీఎస్ టోల్ కలెక్షన్. ఈ జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ ద్వారా వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరానికి ఛార్జ్ వసూలు చేస్తారు. తాజాగా పరిశ్రమల సమాఖ్యా సమావేశంలో పాల్గొన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద జీపీఎస్ బేస్డ్ సిస్టంను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్రైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని యుద్దప్రాతిపదికన పనిచేస్తుందన్నారు.

రానున్న ఆరు నెలల్లో ఈ సిస్టంను అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనివల్ల ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద వేచిఉండే సమయంతోపాటూ రద్దీ కూడా తగ్గిపోతుంది. వాహనాలను నిలిపివేయకుండా వెళ్లవచ్చు. వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఆధారంగా మన వాహనం ఎన్ని కిలోమీటర్లు తిరగిందో తెలుసుకొని అంతకు మాత్రమే రోడ్డు ఛార్జీలను వసూలు చేస్తారు. దీనివల్ల కేంద్రానికి మరింత ఆదాయం చేకూరుతుంది. ప్రస్తుతం ఎన్ హెచ్ ఏ‎ ఐ కి సంవత్సర ఆదాయం రూ. 50వేల కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో ఇది రూ. 1.40 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అంటే మూడు రెట్లు ఎక్కువ అనమాట.

ఇదిలా ఉంటే ఈ జీపీఎస్ విధానంపై మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేస్తారు.? కిలో మీటర్ కు ఎంత వసూలు చేస్తారు.? ఇది ఏవిధంగా చెల్లించాల్సి వస్తుంది.? ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ని పూర్తిగా తీసేస్తారా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

 

T.V.SRIKAR