NEET-2023: రేపే నీట్-2023 ఎగ్జామ్‌.. అభ్యర్థులూ ఈ రూల్స్ తెలుసుకోండి!

ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించబోతున్నారు. సాధారణంగా ప్రతీ సంవత్సరం నీట్‌ ఎగ్జామ్‌కు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. అయితే, ఈ సంవత్సరం 20 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2023 | 01:22 PMLast Updated on: May 06, 2023 | 1:22 PM

Neet Ug 2023 On Sunday Aspirants Should Know These Rules

NEET-2023: దేశవ్యాప్తంగా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌.. నీట్‌-2023 ఆదివారం జరగబోతోంది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా మొత్తం 499 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించబోతున్నారు. సాధారణంగా ప్రతీ సంవత్సరం నీట్‌ ఎగ్జామ్‌కు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. అయితే, ఈ సంవత్సరం 20 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక తెలంగాణ నుంచి 70 వేల మంది నీట్‌ ఎగ్జామ్‌ రాయనున్నారు. తెలంగాణలో మొత్తం 22 ఎగ్జామ్‌ సెంటర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పరీక్షకు స్ట్రిక్ట్‌ రూల్స్‌ పెట్టారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ అభ్యర్థులను ఎగ్జామ్‌ సెంటర్‌లోకి పంపనున్నారు. ఒకటిన్నర తరువాత నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్‌కు ఇక నో ఎంట్రీ. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. అడ్మిట్ కార్డ్‌తో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్ట్ సైజు కలర్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటి ఏదైనా ఒక ఫొటో ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.

ఇవి తప్ప అభ్యర్థుల దగ్గర వేరే ఏవీ ఉండరాదని స్ట్రిక్ట్‌ రూల్స్‌ పెట్టారు అధికారులు. అభ్యర్థులు ఖాళీ చేతులతోనే రావాలని.. ఆఖరికి పెన్నులు కూడా లోనికి అనుమతించేది లేదని చెప్తున్నారు. అభ్యర్థులకు పెన్నులు ఎగ్జామ్‌ హాల్‌ లోపలే ఇస్తారు. ఇక డ్రెస్సింగ్‌ విషయంలో కూడా స్ట్రిక్ట్‌ రూల్స్‌ పెట్టారు. లాంగ్‌ స్లీవ్‌ ఉండే డ్రెస్సులు వేసుకుని ఎగ్జామ్‌కు రావొద్దని సూచించారు. హైహీల్స్‌, శాండిల్స్‌, షూస్‌ కాకుండా స్లిప్పర్‌ చెప్పులు మాత్రమే వేసుకుని వస్తే బెటర్‌ అంటున్నారు. అమ్మాయిలు నగలు ఇంటి వద్దే వదిలేసి వస్తేసే మంచిదంటున్నారు. వాచ్‌లు, వ్యాలెట్లు, బెల్ట్‌, క్యాప్స్‌ ఏవీ ఎగ్జామ్‌ హాల్‌ లోపలికి అనుమతించబోమని చెప్తున్నారు. ఎగ్జామ్‌ అటెండ్‌ చేసే ప్రతీ ఒక్కరు ఈ రూల్స్‌ అన్నీ ముందుగానే తెలుసుకోవాలని చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి మీరినా పరీక్షకు ఎంట్రీ ఇవ్వడం కష్టమంటున్నారు. ఇవి తెలుసుకోకుండా అభ్యర్థులు ఎగ్జామ్‌ సెంటర్‌కు వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్తున్నారు.