KUMARI AUNTY: అమ్మో.. ఇదేం క్రేజ్‌.. కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌

వీడియోలు వైరల్ కావడంతో.. వేరే ఏరియాల నుంచి కూడా యువకులు.. కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఫుడ్‌స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేంది. అప్పటివరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ.. ఆ తర్వాత అందరికీ తెలియడం మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 04:52 PMLast Updated on: Feb 07, 2024 | 4:52 PM

Netflix Making A Documentary On Food Vendor Kumari Aunty

KUMARI AUNTY: కుమారి ఆంటీ.. స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారికి పరిచయం అవసరం లేని పేరు. బిల్లు వెయ్యి.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. ఈ రెండు మాటలు.. కుమారి ఆంటీని.. వైరల్ ఆంటీగా మార్చేశాయ్. మాదాపూర్‌లోని ఓ ఏరియాలో స్ట్రీడ్‌ఫుడ్‌ స్టాల్ పెట్టుకొని.. తన చేతి వంట రుచి చాలామందికి పరిచయం చేశారు. ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్నా.. రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు కుమారీ ఆంటీ. ఐతే ఆమె వీడియోలు వైరల్ కావడంతో.. వేరే ఏరియాల నుంచి కూడా యువకులు.. కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు.

YS SHARMILA: దమ్ముంటే మోదీని ఇది అడుగు.. జగన్‌కు షర్మిల సవాల్‌..

దీంతో ఆమె ఫుడ్‌స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేంది. ఆ రష్ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం.. పోలీసులు కేసు నమోదు చేయడం.. కుమారి ఆంటీకి మద్దతుగా సోషల్ మీడియాలో చిన్నపాటి ఉద్యమం జరగడం.. సీఎం రేవంత్ రియాక్ట్‌ కావడంతో.. వైరల్ ఆంటీ మరింత వైరల్ అయ్యారు. అప్పటివరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ.. ఆ తర్వాత అందరికీ తెలియడం మొదలైంది. ఇక కుమారి ఆంటీ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్లు ఎందరో ! అసలు ఆమె ఎవరు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఇంతకు ముందు ఏం చేసేవారు.. ఇప్పుడు ఇంతలా ఎలా ఫేమస్ అయ్యారని చిన్నపాటి ఇన్వెస్టిగేషన్‌ చేశారు చాలామంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఓ న్యూస్‌.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌.. ఇప్పుడు కుమారీ ఆంటీ మీద డాక్యుమెంటరీ తీయబోతుందనే ప్రచారం జరుగుతోంది. కుమారి ఆంటీపై 3ఎపిసోడ్‌లతో డాక్యుమెంటరీ చేస్తున్నారని.. దానికి ఫేమ్‌ అనే పేరు కూడా పెట్టినట్లు సోషల్‌ మీడియాల ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇదంతా అబద్ధం అని కొందరు కొట్టిపారేస్తుంటే.. నిజం ఎందుకు కాకూడదు అంటూ మరికొందరు లాజిక్‌లు తీస్తున్నారు. ఓవర్‌ నైట్‌లో స్టార్ అయిపోయిన వాళ్లు ఈ మధ్య చాలామందే ఉన్నారు. ఆ లిస్ట్‌లో కుమారీ ఆంటీ లేటెస్ట్‌గా చేరినా.. అంతకుముందు చాలామందే ఇలా సోషల్‌ మీడియా స్టార్లుగా మారిపోయారు. కుర్చీ తాత.. అంతకుముందు బాదాం సాంగ్‌ అంకుల్‌.. ఇలా చాలామంది రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యారు. ఇలా ఓవర్‌నైట్‌ ఫేమస్ అయిన స్టార్లతో.. ఫేమ్‌ అనే డాక్యుమెంటరీ తీయడంలో.. తీయాలి అనుకోవడంలో తప్పు ఏముంది అంటూ.. నెట్‌ఫ్లిక్స్‌ ప్రచారంపై మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంత అబద్ధం అన్న సంగతి ఎలా ఉన్నా.. కుమారి ఆంటీకి సంబంధించిన ప్రతీ విషయం ఇప్పుడు వైరల్ అయిపోతోంది.