Social Media: ట్విట్టర్ కు కొత్త బాస్..
ట్విట్టర్ ఎలోన్ మస్క్ చేతికి వచ్చిన తరువాత ఆ సంస్థలో చాలా మార్పులు జరుగుతున్నాయి. సంస్థ ఎలోన్ మస్క్ చేతికి రాగానే ట్విట్టర్ సీఈఓ పరాగ్ రాజీనామా చేసాడు. అప్పటినుంచి ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్నీ భర్తీ చేయబోతున్నట్టు ఎలోన్ మస్క్ ప్రకటించాడు.
ట్విట్టర్ సీఈఓ గా ఓ మహిళ ఉండబోతున్నట్టు చెప్పాడు. కానీ ఆ మహిళా ఎవరు అనే విష్యం మాత్రం రివీల్ చేయలేదు. అయితే అమెరికా కార్పొరేట్ వర్గాలకు సుపరిచితురాలైన లిండా యకరినో ట్విట్టర్ కొత్త సీఈఓ గా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. NBC యూనివర్సిటీలో లిండా అడ్వర్తైసింగ్ అండ్ పాట్నర్షిప్ విభాగానికి చైర్మన్ గా ఉన్నారు. ట్విట్టర్ కు సీఈఓ గా భాద్యతలు చేపట్టే విషయంలో ఎలోన్ మస్క్ చాల రోజుల నుంచి లిండాతో చర్చలు జరుపుతున్నారట.
రీసెంట్ గా లిండా మస్క్ ను ఇంటర్వ్యూ చేసింది. అంతే కాదు మస్క్ లిండా చాల ఏళ్ళ నుంచి మంచి ఫ్రెండ్స్. దాదాపు పదేళ్ల నుంచి లిండా అడ్వార్తైసింగ్ చైర్మన్ గా పని చేస్తుంది. మార్కెటింగ్ యాడ్స్ ని డిజిటల్ రూపంలోకి మార్చడంలో లిండా కీ రోల్ ప్లే చేసిందట. ట్విట్టర్ లో చాల రోజుల నుంచి జరుగుతున్న మార్పుల వెనక లిండా హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె అనుభవం ట్విట్టర్ కు బాగా ఉపయోగపడుతుందని మస్క్ భావిస్తున్నారట. ఈ విషయం ఫైనల్ ఐన తరువాత దీని గురించి అధికారికంగా ప్రకటన రానుంది.