No Pregnancy: ఇక కండోమ్ అక్కర్లేదు.. కొత్తరకం గర్భనిరోధకాలు రెడీ!

ప్రతి మహిళ జీవితంలో సంతానం అనేది మధురమైన అనుభూతి. అయితే ఇప్పుడు చాలా మంది సంతానాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణం. ఇలాంటి వాళ్లకోసం సరికొత్త గర్భ నిరోధక సాధనం అమల్లోకి తీసుకొస్తోంది కేంద్రప్రభుత్వం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2023 | 06:30 PMLast Updated on: Mar 23, 2023 | 6:30 PM

New Concept For No Pregnancy

ఒకప్పుడు సంతానం వద్దనుకునే వాళ్లు కండోమ్స్, ఇంజక్షన్స్, కాపర్-టి, పిల్స్. ఇలా వివిధ పద్దతులను ఎంచుకునేవారు. ఇంకా పాత రోజుల్లో అయితే ఒకరిద్దరు పిల్లలు చాలనుకున్నాక స్త్రీ లేదా పురుషుడు ఆపరేషన్ చేసుకునేవారు. ఈ ఆపరేషన్ చేసుకున్న తరువాత సంతోనోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. జనాభా తగ్గుదలకు ఇది ఎంతో దోహదపడింది. అయితే ఈ విధానాలన్నీ కాస్త రిస్కుతో కూడుకున్నవి. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న విధానం మాత్రం చాలా సింపుల్.

10 నిమిషాల శస్త్ర చికిత్స:
తాజాగా కేంద్రప్రభుత్వం ఒక కొత్త సాధనాన్ని తీసుకొని వచ్చింది. ఇది 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవుతో టూత్ పిక్ లా ఉంటుంది. దీనిని మోచేతి నుంచి నాలుగు అంగుళాల పైన.. లోపలి కండరాల్లోని కదలిక లేని భాగంలో అమరుస్తారు. దీనికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికీ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తారు.

No Pregnancy New Surgery

No Pregnancy New Surgery

పాతికేళ్ల నుంచే కెన్యాలో ఈ విధానం:
ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా శిక్షణ ఇస్తారు. ఈ సాధనం వల్ల ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. దీనిని ఎప్పడు కావాలంటే అప్పుడు సులభంగా తొలగించవచ్చు. ఎప్పుడు గర్భం దాల్చాలనుకుంటే అప్పుడు 48 గంటల ముందుగా దీనిని తీసివేయాలి. ఎందుకంటే దీనిప్రభావం రెండు రోజుల వరకూ శరీరంలో ఉంటుంది. అందుకే తొలగించిన వెంటనే భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ అంటున్నారు వైద్యులు. ఈ సాధనాన్ని కెన్యాలో 25ఏళ్ల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చారు. కుడి చేతి వాటం కలిగిన వారు ఎడమచేతిలో.. ఎడమ చేతి వాటం కలిగిన వారు కుడి చేతిలో ఉంచుకోవచ్చు. గతంలో ఉన్న విధానాలతో పోల్చితే ఇది చాలా సులువైనది.. సౌకర్యవంతమైనది కూడా.!

వాటికీ.. వీటికి తేడాలు..
గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడో ఒకటి ఉపయోగిస్తే ఉండక పోవచ్చు కానీ తరచూ ఉపయోగిస్తూ ఉంటే మాత్రలలోని కెమికల్స్ గర్భాశయంపై, శరీరంలోని వివిధ ప్రదాన అవయవాలపై పడే అవకాశం ఉంటుంది. అలాగే కండోమ్స్ ని ఉపయోగించినా వాటిలో నాసిరకానికి సంబంధించినవి ఉండవచ్చు. అవి ఇన్ఫెక్షన్లకు కారణం అవ్వచ్చు. అంతేకాకుండా.. ఒక్కోసారి తొడుగు చిరిగిపోయి వీర్యకణాలు లోనికి వెళ్లి గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్లను కూడా తరచూ వాడాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. పైగా డాక్టర్లను సంప్రదించే దీనిని ప్రయోగించాలి. అలా కోరిక పుట్టిన ప్రతిసారీ వైద్యులను సంప్రదించడం కష్టం. అందుకే ఇప్పుడు తీసుకొచ్చిన ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’ విధానాన్ని ఉపయోగించడం వల్ల పైన తెలిపిన ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గర్భాన్ని నిరోధించవచ్చు.

 

T.V.SRIKAR