Ayodhya Ram Mandir : ఇనుము లేదు – సిమెంట్ వాడలేదు.. 2500యేళ్ళు నిలిచేలా రామమందిరం
దేశంలో ఎక్కడ చూసినా రామ నామ జపం మార్మోగుతోంది. అందరూ అయోధ్యలో నిర్మించిన శ్రీరాముడి మందిరం గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్టను కన్నులారా చూడాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతి హిందువు ఎన్నోయేళ్ళ కల ఇది. రామయ్య పుట్టిన నేలలో ఆయనకు ఓ మంచి గుడి కట్టాలి.. ఆయన్ని కొలుచుకోవాలన్న కల నిజమయ్యేరోజు దగ్గర్లోనే ఉంది. అందుకే ఈ రామాలయాన్ని వెయ్యేళ్ళు నిలబడేలా పకడ్బందీగా నిర్మించారు.
దేశంలో ఎక్కడ చూసినా రామ నామ జపం మార్మోగుతోంది. అందరూ అయోధ్యలో నిర్మించిన శ్రీరాముడి మందిరం (Ayodhya Ram Mandir) గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్టను కన్నులారా చూడాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతి హిందువు ఎన్నోయేళ్ళ కల ఇది. రామయ్య పుట్టిన నేలలో ఆయనకు ఓ మంచి గుడి కట్టాలి.. ఆయన్ని కొలుచుకోవాలన్న కల నిజమయ్యేరోజు దగ్గర్లోనే ఉంది. అందుకే ఈ రామాలయాన్ని వెయ్యేళ్ళు నిలబడేలా పకడ్బందీగా నిర్మించారు.
మనం ఏం ఇంటిని కట్టుకున్నా.. ఇంకేదైనా కట్టడమైనా.. దాని నిర్మాణానికి ఇనుము, సిమెంట్ తప్పనిసరిగా వాడతాం. కానీ అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో ఎలాంటి సిమెంట్ (cement) , ఇనుము, (iron) ఉక్కు లేకుండా నిర్మిస్తున్నారు. నాగర నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాతితోనే అద్భుతమైన శిల్పాలు చెక్కి ఆలయాన్ని తీర్చిదిద్దారు. భూకంపాలను కూడా తట్టుకునేలా శ్రీరామ మందిరంను నిర్మించారు.
ఏ కట్టడమైనా ఇనుముతో కడితే.. అది కొన్నేళ్ళకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తానికి ఆ కట్టడం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే అయోధ్య రామ మందిరానికి ఇనుము వాడకుండా.. భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. పురాతన నాగర నిర్మాణ శైలిలో అనుసరించి కట్టారు ఈ ఆలయాన్ని. రాబోయే రోజుల్లో వెయ్యేళ్ళయినా చెక్కు చెదరని రీతిలో.. చిరస్మరణీయంగా ఉండేలా రామాలయం నిర్మాణం జరిగింది. ఈ కట్టడం కోసం మొత్తం రాయినే ఉపయోగించారు.
రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయిని ఉపయోగించారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ నుంచి గులాబీ రాయిని తెప్పించారు. ప్రత్యేక మెషీన్స్ తో వాటిని కట్ చేయించి.. అద్భుతమైన కళాకృతులను చెక్కించారు. ఇతర కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కన్నా ఈ గులాబీరాయి చాలా తేలికగా ఉంటుంది. ప్రతి ఒక్క రాయి జాగ్రత్తగా గాడి చేసి.. సిమెంట్ ను కూడా ఉపయోగించకుండా నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ రాయి భూకంపాలను కూడా తట్టుకుని నిలబడుతుంది. దాదాపు వెయ్యేళ్ళ పాటు రామాలయానికి ఎలాంటి రిపేర్లు రావు అంటున్నారు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు. వెయ్యేళ్ళు కాదు.. 2 వేల ఐదొందల యేళ్ళ పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ గులాబీ రాయి అంత దృఢంగా ఉంటుందని చెబుతున్నారు.
రామ మందిర నిర్మాణానికి పునాది వేసే సమయంలో ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. అయోధ్యలో భూసార పరీక్ష నిర్వహిస్తే.. అక్కడ భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. అడుగు భాగమంతా ఇసుకతో ఉండటమే ఇందుక్కారణమని అన్నారు. దీంతో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే, ఐఐటీ ఢిల్లీ, గువాహతీ, చెన్నై, రూర్కె, ముంబై, ఎల్ అండ్ టీకి చెందిన నిపుణులు.. అంతా కలిసి దీనికో పరిష్కారం ఆలోచించారు. పునాది వేయడానికి ముందు భూమి లోపల దాదాపు 14 మీటర్ల దాకా తవ్వి ఇసుకని పూర్తిగా తొలగించారు.
పునాది కోసం రాళ్ళని సిద్ధం చేసేందుకు రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ ఉపయోగించి.. 56 పొరలతో కాంక్రీట్ మిక్స్ తయారు చేసి వేశారు. ఇది రోజులు గడిచే కొద్ది రాయిగా మారుతుంది. ఈ రాళ్ళ మీదే ఆలయ పునాదిని నిర్మించారని శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్య రామ మందిరం నాగర నిర్మాణ శైలిలో నిర్మించారు. ఉత్తర భారతదేశంలోని హిందూ మతాలు నిర్మించే మూడు శైలులో ఇది ఒకటి. వింధ్య, హిమాలయ మధ్య ప్రాంతంలో ఈ నిర్మాణ శైలి దేవాలయాల్లో కనిపిస్తుంది. ఈ నిర్మాణ శైలిలో ఇనుము ఉపయోగించకపోవడం స్పెషాలిటీ. ఖజురహో ఆలయం, సోమనాథ్ ఆలయం, కోణార్క్ లోని సూర్య దేవాలయం కూడా ఇలా నాగర నిర్మాణ శైలిలో నిర్మించినవే. ఎంతో శ్రమకోర్చి అయోధ్యలో నిర్మించిన శ్రీరామ మందిరంలో ఆ సీతారామ చంద్రమూర్తిని మనమూ దర్శించుకుందాం…
సర్వే జనా సుఖినోభవంతు…