Nostradamus 2024: ప్రళయం తప్పదా? 2024లో భూమిని ముంచే భారీ సునామీ.. నోస్ట్రాడామస్ అంచనాలు నిజమవుతాయా?
2024లో జరిగే విపత్తుల గురించి కూడా నోస్ట్రాడమస్ ఊహించారు. ఈ ఏడాదిలో భారీ సునామీ వస్తుందని తెలిపారు. దాంతో వ్యవసాయం అంతా నాశనం అవుతుంది. భూమినే ముంచేస్తుందని చెప్పారు. అలాగే ప్రతియేటా వచ్చే సహజ తుఫానులు ఉండవు.
Nostradamus 2024: ఫ్రెంచ్ తత్వవేత్త, ప్రవక్త నోస్ట్రాడామస్ (Nostradamus) వందల యేళ్ళ క్రితం చెప్పిన భవిష్యవాణి ఇప్పటికీ నిజం అవుతోంది. ఆయన చెప్పింది నిజమేనని ఎన్నోసార్లు రుజువైంది కూడా. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ ఎటాక్స్, 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవడం, కోవిడ్ మహమ్మారితో క్వీన్ ఎలిజబెత్ చనిపోవడం లాంటివి ఎన్నో నోస్ట్రాడామస్ అంచనా వేశారు. అతను చెప్పినట్టే చాలా సంఘటనలు జరిగాయి. మరి ఆయన చెప్పినట్లు 2024 సంవత్సరంలో ఏం జరగబోతోంది..? ఆయన చెప్పిన ప్రకృతి విపత్తుల గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. 1555లో ఫ్రెంచ్ తత్వవేత్త నోస్ట్రాడామస్ (Nostradamus) తాను రాసిన లే ప్రొఫెటిస్ అనే బుక్‌లో భవిష్యత్తు గురించి ఎన్నో అంచనాలను రాశారు.
Mahesh Babu: విదేశీ టూర్.. ఒకే చోట మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సందడి..
ఈ పుస్తకం 942 కవితలతో ఉంటుంది. లే ప్రొఫెటీస్ బుక్‌లోని కవితలను వివరిస్తూ నోస్ట్రాడమస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకాన్ని 2005లో మారియో రీడింగ్ రాశారు. ఇందులో భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు ఉన్నాయి. అంటే మన బ్రహ్మంగారి కాలజ్ఞానం లాగా.. 1666లో జరిగిన గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్, 9/11 ఎటాక్స్, 2016లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం లాంటివి ఎన్నో నిజమయ్యాయి. ప్రపంచాన్ని గడ గడలాడించిన ప్రాణాంతక వైరస్ కరోనా గురించి కూడా 500 యేళ్ళ క్రితయే ప్రవక్త నోస్ట్రాడమస్ రాశారు. నోస్ట్రాడమస్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం గురించి కూడా చెప్పారు. ఎలిజబెత్ 96 యేళ్ళ వయస్సులో చనిపోతుందని 450 యేళ్ళ క్రితం అతను ఊహించారు. నోస్ట్రాడామస్ బుక్‌లోని ఓ పద్యంలో క్వీన్ ఎలిజబెత్ II దాదాపు 22 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కి.. 96 ఏళ్ల వయసులో చనిపోతారని ఉంది.. ఆయన చెప్పినట్టే సెప్టెంబర్ 2022న మరణించారు. మరణించే నాటికి ఆమె వయస్సు 96 యేళ్ళు.
KCR-KTR: గులాబీ పార్టీలో ఓటమి భయం..? కేసీఆర్, కేటీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ..
దాంతో నోస్ట్రాడామస్ అంచనా వేసింది కరెక్టేనని తేలింది. కింగ్ ఛార్లెస్ 3 సింహాసనాన్ని వదులుకుంటారనీ, ప్రిన్స్ హ్యారీ అతని స్థానంలో బాధ్యతలు చేపడతారని రాశారు. రాణి మరణానికి ముందు నోస్ట్రాడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకం 5 కాపీలు మాత్రమే అమ్ముడుపోయాయి. కానీ రాణి చనిపోయాక ఈ బుక్ సేల్స్ విపరీతంగా జరిగాయి. 2024లో జరిగే విపత్తుల గురించి కూడా నోస్ట్రాడమస్ ఊహించారు. ఈ ఏడాదిలో భారీ సునామీ వస్తుందని తెలిపారు. దాంతో వ్యవసాయం అంతా నాశనం అవుతుంది. భూమినే ముంచేస్తుందని చెప్పారు. అలాగే ప్రతియేటా వచ్చే సహజ తుఫానులు ఉండవు. దాంతో కరువు కాటకాలు సంభవిస్తాయి. ఓ వైపు కరువు, మరోవైపు అతివృష్టితో జనం ఇబ్బందులు పడతారు. భూమి గతంతో పోలిస్తే చాలా వేడిగా ఉంటుంది. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తాయి. నోస్ట్రాడామస్ అంచనాల ప్రకారం 2024లో న్యూక్లియర్ ఎటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇదే జలవాయులపై ప్రభావం చూపించే ఛాన్సుంది.
ఇంకా.. అమెరికా అధ్యక్షుడి ఎన్నిక 2024లో అస్థిరతకు దారి తీయవచ్చు. దాంతో ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చే ఛాన్సుందని నోస్ట్రాడామస్ అంచనాలు చెబుతున్నాయి. పోప్ అధికారంలో మార్పు గురించి కూడా అంచనా వేశాడు. జనరల్‌గా వాటికన్ సిటీలో ప్రతి యేటా వృద్ధ పోప్ పదవిని చేయపడతారు.. కానీ అందుకు భిన్నంగా యువ పోప్ వస్తాడని రాశారు. ఇది కేథలిక్ చర్చిపై ప్రభావం చూపిస్తుందని నోస్ట్రాడామస్ తెలిపారు. ఈసారి అంచనాల్లో భారత్‌కు సంబంధించిన అంశం కూడా ఉంది. 2024లో భారత్-చైనా మధ్య వివాదం ముదురుతుంది. ఇది హిందూ మహాసముద్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నోస్ట్రాడమస్ జోస్యం చెప్పారు. ఇప్పటిదాకా ఈ ఫ్రెంచ్ తత్వవేత్త చెప్పిన అంచనాలన్నీ జరగడంతో.. భారీ సునామీ కూడా తప్పదా అనే చర్చ నడుస్తోంది.