Onion Prices” ఇప్పుడు టమాట.. రేపు ఉల్లి వంతు.. వాతలకు రెడీగా ఉండండి దోస్తోం..
టమాట కొనలేక.. కూరలు రుచిలేక.. కొనే ధైర్యం లేక.. మధ్య తరగతి జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలు మోతెక్కిపోతుంటే.. ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయ్. కేజీ ధర డబుల్ సెంచరీకి చేరింది చాలాచోట్ల ! టమాట కొనలేక.. కూరలు రుచిలేక.. కొనే ధైర్యం లేక.. మధ్య తరగతి జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలు మోతెక్కిపోతుంటే.. ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెలాఖరు వరకు పెరుగుతూ వెళ్లి… సెప్టెంబరునాటికి కిలో 60 నుంచి 70 రూపాయల వరకు చేరొచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది. ఐతే 2020 నాటి గరిష్ఠాల దిగువనే ఉల్లి ధరలు కొనసాగుతాయని తెలిపింది.
సప్లై, డిమాండ్.. మధ్య తేడా ఈ ఆగస్ట్ చివరికి కనిపించే చాన్స్ ఉంది. రబీ ఉల్లి నిల్వ కాలం ఒకటి నుంచి రెండు నెలలు తగ్గాయ్. ఈ నిల్వలు ఆగస్టు చివరికే తగ్గుముఖం పట్టూబోతున్నాయ్. దీంతో సెప్టెంబరు నాటికి సరఫరాలు తగ్గి.. ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయ్. ఐతే అక్టోబరు నుంచి ఖరీఫ్ పంట లభ్యత పెరిగితే… ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్.. తన నివేదికలో తెలిపింది. పండగల సీజన్‌లో ధరలు స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.
పప్పు ధాన్యాలు, ఇతర కూరగాయల ధరలతో ఇబ్బంది పడ్డ వినియోగదారులు.. ఈ ఏడాది జనవరి, మే నెలలో ఉల్లి ధరలు తగ్గడంతో ఊరట చెందారు. ధర లేకపోవడంతో.. ఖరీఫ్ సీజన్‌లో తక్కువ పంట సాగుచేశారు. దీంతో ఈ ఏడాది 8శాతం మేర పంట విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి 5శాతం తగ్గింది. తక్కువ ఖరీఫ్, రబీ దిగుబడి కనిపించినప్పటికీ.. ఈ ఏడాది ఉల్లి సరఫరా మరీ ఇబ్బందిగా ఏమీ మారకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయ్.