PayTM Shares : పుట్టెదు కష్టాల్లో పేటీఎం… స్టాక్ మార్కెట్లో పతనం… 20 వేల కోట్లకు పైగా నష్టం
పేమెంట్స్ బ్యాంక్ ను క్లోజ్ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) ఆదేశాలతో పేటీఎం షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు పడిపోయాయి. షేర్ల విలువ దాదాపు 50శాతానికి పడిపోవడంతో 20 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిదారులు నష్టపోయారు.

Paytm is in trouble... Fall in the stock market... Loss of more than 20 thousand crores
పేమెంట్స్ బ్యాంక్ ను క్లోజ్ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) ఆదేశాలతో పేటీఎం షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు పడిపోయాయి. షేర్ల విలువ దాదాపు 50శాతానికి పడిపోవడంతో 20 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిదారులు నష్టపోయారు. ఈ కంపెనీ షేరు 10శాతం తగ్గిపోయింది 438.50 రూపాయలకు చేరుకుంది. BSE లో రికార్డు స్థాయి కనిష్టం ఇది. గత రెండు సెషన్స్ లో ఈ స్టాక్ 20శాతం చొప్పున తగ్గుతూ ఇప్పటికి 40శాతానికి పడిపోయింది. దాంతో ఇన్వెస్టర్లు భయంతో వణికిపోతున్నారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) పై జనవరి 31న RBI ఆంక్షలు విధించింది. డిపాజిట్లు స్వీకరించకుండా, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్ టాప్ అప్ చేయడానికి వీల్లేకుండా ఆదేశాలు జారీ చేసింది. సిస్టమ్ ఆడిట్ రిపోర్ట్ లో అవకతవకలతో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల కేవైసీ నిబంధనలు కూడా సరిగా పాటించడం లేదని RBI తెలిపింది. ఫిబ్రవరి 29 లోగా పేటీఎం నిర్వహిస్తున్న పేమెంట్స్ సర్వీసెస్ ఖాతాలను మూసివేయాల్సి ఉంది. తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మనీలాండరింగ్ ఆరోపణలు కూడా వస్తున్నప్పటికీ పేటీఎం మాత్రం ఖండించింది.
ఉద్యోగులకు అభయం పేటీఎం ఆర్థిక సంక్షోభం (Paytm financial crisis) లో చిక్కుకోవడంతో… అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు CEO విజయశేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) అభయం ఇచ్చారు. తప్పు ఎక్కడ జరిగిందో తనకు తెలియదనీ…అయితే ఎంప్లాయీస్ కి ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమన్నారు. కంపెనీ లేఆఫ్ ప్రకటించే అవకాశం లేదనీ… దేశంలోని ప్రముఖ బ్యాంకులతో కలసి పనిచేస్తామన్నారు. ఈ వివాదం పరిష్కరించుకోడానికి రిజర్వ్ బ్యాంక్ ను సంప్రదిస్తున్నట్టు పేటీఎం సీఈఓ శర్మ చెప్పారు. పేటీఎంలో 900 మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు.