Pension Scheme: ఇంట్రోవర్ట్స్‌కు పెన్షన్.. స్కీం భలే ఉందే..
ఇంట్రోవర్ట్స్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్లు ఎవరితోను పెద్దగా కలవరు. ఎక్కువగా బయటికి రారు. అందరి ముందు ఏదైనా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ధైర్యం చేయరు. చాలా సిగ్గు, ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ల కోసం సౌత్ కొరియా గవర్నమెంట్ ఓ స్కీం తీసుకొచ్చింది.
దేశంలో ఉన్న ఇంట్రెవర్ట్స్‌కు నెలకు 490 డాలర్లు పెన్సన్ ఇవ్వాలని నిర్ణయింది. వీళ్లు ఏమైనా దివ్యాంగులా వీళ్లకు పెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. సౌత్ కొరియా పాపులేషన్ దాదాపు 51 మిలియన్స్ ఉంటుంది. ఇందులో దాదాపు 50 పర్సెంట్ ఇంట్రోవర్ట్స్‌గానే ఉన్నారని రీసెంట్‌గా ఓ సర్వేలో తేలింది. వీళ్లు బయటికి రారు కాబట్టి ఎలాంటి యాక్టివిటీస్‌లో పాల్గొనరు. దేశంలో ఏం జరిగినా మాకు అనవసరం అన్నట్టు ఉంటారు. ఇది సౌత్ కొరియాకు పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. ఇంకో హైలెట్ ఏంటి అంటే చాలా మంది పెళ్లి చేసుకునేందుకు కూడా ఇష్టపడటంలేదట. జాబ్స్ చేసేందుకు ఆసక్తి చూపడంలేదట.
మొదట్లో చాలా తక్కువ మంది ఇలా ఉండేవాళ్లు. కానీ కరోనా అవుట్ బ్రేక్, లాక్‌డౌన్ తరువాత ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉండాలి అనుకునేవాళ్ల నెంబర్ పెరిగిపోయిందట. ఒక దేశానికి నిజమైన సంపద ఆ దేశంలో ఉండే యువతే. కానీ అలాంటి యువతే ఇంట్రోవర్ట్స్‌గా మారి ఇంట్లోనే ఉంటే ఇక దేశాన్ని పట్టించుకునేవాళ్లు ఎవరు. భవిష్యత్తు తరాలకు భరోసా ఎవరు. ఇదే విషయాన్ని సౌత్ కొరియా గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంది. వెంటనే వీళ్లందరిని మార్చాలంటే ఏదైనా చేయాలని ఈ స్కీం తీసుకొచ్చింది. 9 నుంచి 24 ఏళ్ల వయసున్న ఇంట్రోవర్ట్‌లను సెలెక్ట్ చేసిన పెన్షన్ ఇస్తారట.
ఈ పెన్షన్‌తో వీళ్లు తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు అనేది వాళ్ల ఇష్టం. కానీ ఇంట్రోవర్ట్‌లను నార్మల్ మనుషులుగా మార్చడమే ఈ స్కీం లక్ష్యం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో సరదాగా బయట తిరుగుతూ వాళ్ల ఒంటరితనాన్ని దూరం చేసుకుని అందరితో కలిసిపోవచ్చు. సౌత్ కొరియాలో ఓ వ్యక్తి నెల రోజులు బతకడానికి యావరేజ్‌గా 490 డాలర్లు సరిపోతాయా అనే విషయం పక్కన పెడితే.. లోన్లీనెస్ పోగొట్టుకోడానికి బయట తిరిగేందుకు మాత్రం ఈ డబ్బు సరిపోతుంది. వాళ్లు ఈ పెన్షన్‌తో కావాలనుకున్న కోర్స్‌లు కూడా నేర్చుకోవచ్చు. దీంతో జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెంచుకోవచ్చు.
దీనివల్ల పెళ్లి వద్దు అనుకునే వాళ్ల నెంబర్ తగ్గుతుంది. ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్ల మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కారణంగా సౌత్ కొరియాలో పాపులేషన్ పెరగడంలేదట. సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్‌లో మరింత తగ్గిపోయే ప్రమాదముంట. ఈ కారణంగానే పరిస్థితి మార్చాలని డిసైడయ్యింది సౌత్ కొరియా గవర్నమెంట్. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీం ఇంట్రోవర్ట్‌లను ఎక్స్‌ట్రోవర్ట్‌లుగా మారుస్తుందో లేదో చూడాలి.