Philippines ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
మంగళవారం అక్కడ 5.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం కారణంగా దేశ రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజలు మనీలా వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

Philippines ఫిలిప్పీన్స్ వరుస భూకంపాలతో అల్లాడిపోతోంది. ఈ ఆగ్నేయాసియా దేశం శనివారం నుంచి భూకంపాల ప్రభావానికి గురవుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా అక్కడి లుజోన్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం అక్కడ 5.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం కారణంగా దేశ రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజలు మనీలా వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
Rajini Saichand: కాంగ్రెస్‌లోకి సాయిచంద్ భార్య!? అందుకే పదవికి రాజీనామా చేయలేదా..
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. లుజోన్ ప్రాంతంలోని భూకంపం భూమి అంతర్భాగంలో 79 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజధాని నుంచి ప్రజల్ని తరలించే పనిలో అధికారులు ఉన్నారు. అక్కడి సెనెట్, అధ్యక్ష భవనంతోపాటు ఇతర ప్రభుత్వ భవనాలను అధికారులు ఖాళీ చేశారు. స్టూడెంట్స్ కూడా యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చేశారు. ఇంకా భూకంప ప్రభావం పొంచి ఉండటంతో ప్రజలు భయంతోనే గడుపుతున్నారు. గత శనివారం ఫిలిప్పీన్స్, జపాన్ నైరుతి ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం కూడా 6.6 తీవ్రతతో భూమి కంపించింది.
అనంతరం సోమవారం తెల్లవారుజామున మిండానావో ద్వీపంలోని హినాటువాన్ మున్సిపాలిటీలో మరోసారి భూమి కంపించింది. భూకంపం సంభవించినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.