Sleeping Position: పడుకునే పొజిషనే మీరెలాంటి వాళ్లో చెప్పేస్తుంది..!

వెల్లకిలా పడుకోవడం, బోర్లా పడుకోవడం, ఎడమ వైపు లేదా కుడి వైపు తిరిగి పడుకోవడం.. ఇలా వేర్వేరే పొజిషన్లను బట్టి వేర్వేరు వ్యక్తిత్వాన్ని నిర్ధరించవచ్చు. మనం ఎలా పడుకుంటామో.. అలాగే జీవిస్తాం.. అంటున్నారు దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 22, 2023 | 05:03 PMLast Updated on: Jun 22, 2023 | 5:03 PM

Personality Test Your Sleeping Position Reveals Your Hidden Personality Traits

Sleeping Position: మనిషి పడుకునే పొజిషన్‌ను బట్టి వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చట. ద యూరోపియన్ జర్నల్ ఆఫ్ పొటెన్షియనల్ నివేదిక ప్రకారం.. మనిషి పడుకునే విధానానికి, అతడి వ్యక్తిత్వానికి, బయట ఎలా నడుచుకుంటాడు అనేదానికి సంబంధం ఉంది. వెల్లకిలా పడుకోవడం, బోర్లా పడుకోవడం, ఎడమ వైపు లేదా కుడి వైపు తిరిగి పడుకోవడం.. ఇలా వేర్వేరే పొజిషన్లను బట్టి వేర్వేరు వ్యక్తిత్వాన్ని నిర్ధరించవచ్చు. మనం ఎలా పడుకుంటామో.. అలాగే జీవిస్తాం.. అంటున్నారు దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు. వీరి అధ్యయనానికి సంబంధించి నాలుగు రకాలుగా పడుకునే పొజిషన్ల గురించి వివరాలు వెల్లడయ్యాయి.
బ్యాక్ స్లీపింగ్
బ్యాక్ స్లీపింగ్.. అంటే శరీర వెనుక భాగాన్ని బెడ్‌కు ఆనించి, పైకి చూస్తూ పడుకోవడం. ఇలా బ్యాక్ స్లీపింగ్ చేసేవాళ్లు చాలా ఏకాగ్రతతో ఉంటారు. తక్కువగా మాట్లాడుతారు. బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ, సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇలాంటివాళ్లు తమ మీదే కాకుండా.. ఇతరుల మీద కూడా నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆశావహ దృక్పథంతో ఉంటూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలనే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. లక్ష్యాలు చేధించే విషయంలో పట్టుదలతో ఉంటారు. వివాదాలు, చాడీలు చెప్పుకోవడం వంటి విషయాలపై ఆసక్తి ఉండదు. తన పని తాను చేసుకుంటూ, తనకుతాను ఎదగాలనుకుంటారు. బ్యాక్ స్లీపింగ్‌లో మరో రెండు పొజిషన్స్ ఉంటాయి. ఒకటి కాళ్లు చేతులు దగ్గరగా ఉంచుకోవడం (సోల్జర్ పొజిషన్), రెండోది దూరంగా చాచి పడుకోవడం (స్టార్‌ఫిష్ పొజిషన్). సోల్జర్ పొజిషన్ వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటే, స్టార్‌ఫిష్ పొజిషన్‌లో పడుకునే వాళ్లు ఎదుటివారి బాధను అర్థం చేసుకోగలరు.
ఫెటల్ స్లీపింగ్ పొజిషన్
కాళ్లు, చేతులు దగ్గరకు ముడుచుకుని, ఒక పక్కకు తిరిగి పడుకోవడాన్ని ఫెటల్ స్లీపింగ్ పొజిషన్ అంటారు. ఇలా పడుకునేవాళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. సిగ్గు ఎక్కువ. ఇంట్రోవర్ట్ అయ్యుండొచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. రచన, సింగింగ్, డాన్సింగ్ వంటి టాలెంట్స్, క్రియేటివిటీ కలిగి ఉంటారు. ఈ పద్ధతిలో పడుకోవడం వల్ల బయట ఎదుర్కొనే సమస్యలకు దూరంగా ఉండగలుగుతారు. చుట్టూ కుటుంబ సభ్యులు, కావాల్సిన వాళ్లు ఉన్నప్పుడు సంతోషంగా ఫీలవుతారు.
పొట్టపై నిద్ర పోవడం
పొట్ట, ఛాతి మంచానికి ఆనించి నిద్ర పోవడాన్ని స్టమక్ పొజిషన్ అంటారు. ఇలా నిద్రపోయేవాళ్లు చాలా సరదాగా ఉంటారు. జాలీగా ఉంటూ, గోల చేస్తూ, ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి అనిపించుకుంటారు. తమకేం కావాలో జీవితంలో ఒక స్పష్టతతో ఉంటారు. అయితే.. లోపల మాత్రం ఏదో బాధ, దిగులు ఫీలవుతుంటారు. అన్నింటినీ అదుపులో ఉంచుకోగలరు. విమర్శల్ని తట్టుకోలేరు. బలమైన సంకల్పం, సాహసం చేసే గుణం, ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. లోపలి నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం బయటపడకుండా చూసుకుంటారు. ఈ పొజిషన్‌లోనే స్కైడైవర్ పొజిషన్ కూడా ఉంటుంది. అంటే స్కై డైవింగ్ చేస్తున్నవారిలాగా పడుకుని ఉంటారు. ఇలాంటి వాళ్లు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ప్రదేశాల్లో ఉత్సాహంగా గడుపుతారు. విమర్శల్ని ఒప్పుకోరు.
పక్కకు తిరిగి పడుకోవడం
ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకునే వాళ్లు సోషల్‌గా అందరితో ఈజీగా కలిసిపోతారు. ఎవరితోనైనా, ఏ సమయంలోనైనా బాగా మాట్లాడగలరు. సన్నిహితులతో నిజాయితీగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. పక్కకు తిరిగి పిల్లోను హత్తుకుని పడుకునేవాళ్లు మంచి స్వభావం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల దగ్గర వారికి నచ్చినట్లు ఉంటారు. అయితే, బాగా పని చేసే మనస్తత్వం మాత్రం కాదు. పనికన్నా.. తన చుట్టూ ఉండే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. వారిని ప్రేమించే మనుషులతో మరింత నమ్మకంగా ఉంటారు. ప్రకృతి అంటే ఇష్టం. చుట్టూ ఉండేవారి సంరక్షణ చూసుకుంటారు. పక్కకు తిరిగి కాళ్లు, చేతులు పూర్తిగా చాపి పడుకునే వాళ్లు బంధాలకు బాగా విలువనిస్తారు. ఇతరులతో నెమ్మదిగా కలిసిపోయినా.. తర్వాత నుంచి వారితో ప్రేమగా ఉంటారు.