PM MODI: చైనా సరిహద్దులో మోదీ.. సైనికులతో దీపావళి..!

ప్రతి ఏడాది దీపావళిని ప్రధాని సైనికులతోనే జరుపుకోవడం ఆనవాయితీ. 2014 నుంచి ఆయన ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి కూడా ప్రధాని సైనికులతోనే దీపావళి వేడుకలు జరుపుకొంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 12, 2023 | 01:26 PMLast Updated on: Nov 12, 2023 | 1:28 PM

Pm Modi Celebrates Diwali In Himachal Pradeshs Lepcha With Soldiers

PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత–చైనా సరిహద్దులో దీపావళి జరుపుకొంటున్నారు. దేశ ఆర్మీ యూనిఫాం ధరించి, సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది దీపావళిని ప్రధాని సైనికులతోనే జరుపుకోవడం ఆనవాయితీ. 2014 నుంచి ఆయన ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్

దీనిలో భాగంగా ఈసారి కూడా ప్రధాని సైనికులతోనే దీపావళి వేడుకలు జరుపుకొంటున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు మోదీ ఇలా సైనికులతో దీపావళి జరుపుకొంటారు. తాజా వేడుకల కోసం ప్రధాని మోదీ.. ఆదివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు. అనంతరం ఆర్మీ యూనిఫాం ధరించిన మోదీ.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సైనికుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారితో సరదాగా మాట్లాడుతూ.. వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఇబ్బందుల గురించి కూడా అడిగారు. లెప్చా.. భారత్, చైనా సరిహద్దులో ఉంది.

అంతకుముందు ప్రధాని దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని గత ఏడాది కార్గిల్‌లో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు.