PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన భారీగా పెంపు..

ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు అందజేస్తారు. ఇకపై ఈ సాయాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2023 | 05:05 PMLast Updated on: Nov 21, 2023 | 5:05 PM

Pm Modis Big Announcement In Rajasthan Pm Kisan Samman Nidhi Amount To Be Increased To Rs 12000

PM Kisan Samman Nidhi: దేశంలోని రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ తాజా ప్రకటన చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ప్రసంగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన సాయం పెంపుపై హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.

KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!

ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు అందజేస్తారు. ఇకపై ఈ సాయాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. గతంలో మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. అంటే ఇకపై రైతులకు రెట్టింపు ప్రయోజనం కలగనుంది. అయితే, పెరిగిన నిధులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే విషయాన్ని ప్రధాని వెల్లడించలేదు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన సాయాన్ని పెంచింది. అలాగే రైతులకు మరిన్ని పథకాల్ని ప్రకటించింది. పంటలకు కనీస మద్దతు ధర, బోనస్ వంటివి ప్రకటించింది.

రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంతకుముందు ఉచిత పథకాల్ని వ్యతిరేకించిన బీజేపీ.. ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లాగే కొన్ని ఉచిత పథకాల్ని ప్రకటిస్తూ వస్తోంది. అయితే, ఈ పథకాలు బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తాయో చూడాలి.