PNB Power Savings Account: మహిళలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5లక్షలు ఉచితంగా వచ్చినట్లే..!
బ్యాంకులు సాధారణంగా ఖాతాలు మాత్రమే ఓపెన్ చేస్తాయి. అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచేలా చూసుకోండని హెచ్చరికలు కూడా చేస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు కూడా ఒక వ్యాపార సంస్థల్లాగా ఖాతాదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో జన్ ధన్ ఖాతాలను ప్రధాని ప్రారంభించారు. ఇందులో కనీస నిలువ సున్నా రూపాయలు. దీని కోవలోకే మరికొన్ని బ్యాంకులు క్యూలు కట్టాయి. సాధారణంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నెలంతా కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టి బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటారు. వీరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల వినియోగదారునికి సౌకర్యంతో పాటూ బ్యాంకులకు అలాంటి ఖాతాదారుల నుంచి లావాదేవీలు జరుగుతాయి. ఎంత ఎక్కువ ఖాతాదారులు ఉన్నారన్నది కాదు. ఎంత ఎక్కువ స్ధాయిలో లావాదేవీలు జరిగాయన్నది ముఖ్యం. ఎక్కువ లావాదేవీలు జరిగే బ్యాంకులు లాభాల్లో నడుస్తుంటాయి. ఎందుకంటే ఇందులో ప్రజలు జమచేసే మొత్తాన్ని బ్యాంకులు వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతాయి. తద్వారా స్థిరంగా కొనసాగుతూ తమ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్విఘ్నంగా కొనసాగిస్తాయి.
5లక్షల వరకూ ఉచిత ఇన్సురెన్స్:
ఇపుడు ఇదే సూత్రాన్ని అవలంబించేందుకు ముందుకు వచ్చింది ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank). ఈ బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ (Savings Account) ఆఫర్ చేస్తోంది. ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగా 5 లక్షల వరకూ ఇన్సురెన్స్ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా SBI బ్యాంకుల్లో మినిమం రూ.100 సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు గానూ ఖాతాదారునికి 1లక్ష వరకూ యాక్సిడెంటల్ డెత్ క్రింద ఇన్సురెన్స్ వర్తింపు అవుతుంది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా తెరిచిన వెంటనే స్వీప్ ఫెసిలిటీ, ఉచితంగా డెబిట్ కార్డ్, లాకర్ రెంట్ ఛార్జీలపై తగ్గింపు, నెఫ్ట్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు లేకపోవడం లాంటి ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి.
అదనపు ఛార్జీలు ఉండవు:
PNB Power Savings Account ఎస్ఎంఎస్ అలర్ట్, నెఫ్ట్ ఛార్జీలు ఉండవు. అకౌంట్ స్టేట్‌మెంట్, సిగ్నేచర్ అటెస్టేషన్, డూప్లికేట్ పాస్‌బుక్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, బ్యాలెన్స్ సర్టిఫికెట్ కోసం అదనంగా ఛార్జీలు వసూలు చేయరు. అందులోనూ మహిళలకోసం ప్రత్యేకంగా రూపొందించబడింది కాబట్టి ఉచితంగా రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లభిస్తుంది. అంతేకాకుండా హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకుంటే డాక్యుమెంటేషన్ ఛార్జీలు కూడా ఉండవు. ఉచితంగా రూ.5 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. సాధారణంగా డెబిట్ కార్డులకు వచ్చే రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ కూడా ఇందులోనే కలిపి ఉంటుంది.
లాకర్.. లోన్ సదుపాయం:
ఇందులో చిన్న లాకర్ తీసుకుంటే మొదటి ఏడాది ఛార్జీల్లో 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌కు స్వీప్ సదుపాయం కూడా ఉంది. ఈ సదుపాయం ఎంచుకుంటే అకౌంట్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే అందులో కొంత లిమిట్ తర్వాత మిగతా డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లోకి ఆటోమెటిక్‌గా వెళ్తాయి. ఆ మొత్తానికి అధిక వడ్డీ లభిస్తుంది. త్రైమాసికానికి సరాసరి బ్యాలెన్స్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000, మెట్రో నగరాల్లో రూ.2,000 చొప్పున ఉంటుంది. ఈ అకౌంట్ ఉన్నవారికి ప్రతీ ఏటా 50 పేజీల చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది. వీరు ప్రతీ రోజు రూ.50వేల వరకు డబ్బులు నేరుగా బ్యాంకులోకి వెళ్లి తీసుకోవచ్చు.