Popcorn boy: ఆస్కార్ వేడుకకి పాప్ కార్న్ బాయ్ – అదృష్టమంటే ఇదే..!

ప్రస్తుత యుగంమంతా సోషల్ మీడియాదే అని చెప్పాలి. ఎందుకంటే వారి వారి కళలను చిత్రీకరించి పలువురికి చూపించే వేదికగా మారిపోయింది కనుక. ప్రతిభతోపాటూ కొన్ని సంఘటనలను కూడా అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనే టెక్సాస్లో చోటు చేసుకుంది. పాప్ కార్న్ అమ్ముకునే వాడిని ఆస్కార్ వేదికకు పరిచయం చేసింది. దీనిని బట్టి మీకే అర్థమై ఉండాలి అతని ప్రతిభ ఎంతటిదో. మనం ఆ పాప్ కార్న్ టేస్ట్ చేయకున్నా అతను చేసే విధానాన్ని చూసేద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 06:24 PMLast Updated on: Mar 12, 2023 | 6:25 PM

Popcorn Boy Get Chance To Give Popcotn To Celebretis

ఆస్కార్ అంటే ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రతిభ కనబరిచిన వారికి అందించే మహోత్తర పురస్కారం. అలాంటి వేదికపై అవార్డు కాకపోయినా అది చూసే అవకాశం కలిగినా చాలనుకుని మురిసిపోయేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇక్కడ మురిసిపోయే అవకాశం కాకుండా ప్రతి ఒక్క అతిధితో కలిసిపోయే అవకాశం వస్తే ఇంక ఆ ఆనందానికి అవధులుండవు. ఎగిరి గెంతేస్తాం. కాసేపు ఆగండి మరీ ఆనందం ఎక్కువైనా విషాదం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే విషయాన్ని తెలుసుకుందాం.

అతడు టెక్సాస్ నగరం కార్పస్ క్రిస్టీ అనే ప్రాంతంలోని సెంచరీ 16 ధియేటర్లో పాప్ కార్న బాయ్ గా పనిచేస్తున్నాడు జాసన్ గ్రోస్ బోల్. కేవలం పాప్ కార్న్ బాయ్ కదా అని తేలిగ్గా తీసుకోకండి. అందులో అతడు తనదైన కళా నైపుణ్యాన్ని జోడిస్తున్నాడు. దీనిని అతని మిత్రుడు ఒక మీడియా మాధ్యమంలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. ఇలా వైరల్ అయిన తరువాత ఆస్కార్ వేదికపై హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ కు తన మిత్రుడు ఈ పాప్ కార్న్ బాయ్ గురించి చెప్పాడు. వెంటనే అతని వైవిద్యాన్ని గుర్తించేందుకు ఒక లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఇది చేసి దాదాపు రెండు నెలలకాలం పూర్తైంది.

ఇదే కళ అతనికి కళాకారుల వద్దకు చేర్చింది. అదే వచ్చిన ప్రతి ఒక్క అతిథికి తన చేతుల మీదుగా పాప్ కార్న్ అందించే సువర్ణవకాశం. ఇతనికి నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం పట్టుకుంది. అందుకే డాల్బీ థియేటర్లో జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు ఆహ్వానం అందించారు. ఇతని పాప్ కార్న ను వచ్చిన వివిధ కళాకారులందరూ రుచి చూసి ఏమని కితాబిస్తారో చూడాలి. లేకుంటే సినిమాలోనే అవకాశలిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.

 

T.V.SRIKAR