PRAJAVANI TENSION: ప్రజావాణితో కొత్త టెన్షన్.. భారీ క్యూలైన్లతో జనం పరేషాన్.. పరిష్కారం ఏంటి..?
ప్రజావాణిలో ఫిర్యాదులు ఇవ్వడానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలి వస్తున్నారు. శుక్రవారం నాడైతే 35 వేల మంది దాకా రావడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అయింది.
PRAJAVANI TENSION: మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అని ప్రమాణస్వీకారం రోజున ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరుసటి రోజు ప్రగతి భవన్‌ని ప్రజా భవన్‌గా మార్చి, అక్కడ ప్రజాదర్బార్ పెట్టి జనం సమస్యలు వింటున్నారు. ప్రజాదర్బార్ పేరు ఇప్పుడు ప్రజావాణిగా మారింది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాధితుల గోడు విన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎంకు చెప్పుకుంటే తమ బాధలు తీరుతాయన్న నమ్మకంతో జిల్లాల నుంచి జనం హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. దాంతో ఇప్పుడు సిటీలో కొత్త సమస్యలు వస్తున్నాయి.
SALAAR FIRST REVIEW: సైడ్ ఇవ్వాల్సిందే.. సలార్ ఫస్ట్ రివ్యూ..
బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ క్యాంపాఫీస్ ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడూ సామాన్యులకు తెరుచుకోలేదు. తెలియక ఎవరైనా సీఎంకు తమ గోడు చెప్పుకుందామని వచ్చినా.. పోలీసులు అంత దూరం నుంచే గెంటేసేవారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చాక.. తమది రాజరికం కాదు.. ప్రజావాదం అంటూ జనానికి సమస్యలు చెప్పుకోడానికి ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అర్జీలు స్వీకరించగా, మరుసటి రోజున మంత్రులు అర్జీలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ప్రతి ఫిర్యాదుకు ఐడీ నెంబర్ కేటాయించడం.. ఆన్‌లైన్లో డేటా ఎంట్రీ చేస్తుండటంతో జనం పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. జనం ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో.. ప్రజావాణిని మంగళ, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు ఇవ్వడానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలి వస్తున్నారు. శుక్రవారం నాడైతే 35 వేల మంది దాకా రావడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. అబిడ్స్, నాంపల్లి ఏరియా నుంచి పంజాగుట్ట దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజాభవన్‌కు తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు.
YS JAGAN: ఏపీ అసెంబ్లీకి ముందే ఎన్నికలు.. కేబినెట్ భేటీలో జగన్ హింట్..!
ఇందులో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు.. గంటలు గంటలుగా నిలబడాల్సి రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందులతో హైదరాబాద్‌కి వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలా.. దీనికి వేరే పరిష్కారం లేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణిని గ్రామ, మండల స్థాయిలోనే బలోపేతం చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సూచిస్తున్నారు. దీనికోసం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలని, పకడ్బందీగా మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్రతి ఫిర్యాదుపై సమీక్ష చేసి పరిష్కరించాలని సూచించారు. సీఎం పేషీలో ఓ IAS అధికారి ఆధ్వర్యంలో డెస్క్ పెట్టాలి. ఈ డెస్క్ నుంచి ప్రతి రోజూ కలెక్టర్లతో మాట్లాడుతూ.. జనం సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని Xలో ట్వీట్ చేశారు. ప్రతి రోజూ ముఖ్యమంత్రి 30 ఫిర్యాదులను రాండమ్‌గా అన్ని జిల్లాల నుంచి సెలక్ట్ చేసుకొని పిలిపించుకొని.. వారి గోడు వినగలిగితే చాలని సలహా ఇచ్చారు ఆకునూరు మురళి. అయితే మండల, గ్రామస్థాయిలో ఈ ఫిర్యాదుల కోసం రెవెన్యూ, ఇతర శాఖల ఆధ్వర్యంలో డెస్క్ ఏర్పాటు చేసి అక్కడే ఫిర్యాదులు స్వీకరిస్తే బెటర్ అని మరికొందరు సూచిస్తున్నారు.
అవసరమైతే అక్కడి నుంచే వీడియో కాల్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతి రోజూ కొంత టైమ్ కేటాయించి మాట్లాడగలిగితే ఇంకా బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. జనం జిల్లాల నుంచి బోల్డన్ని ఛార్జీలు పెట్టుకొని.. అష్టకష్టాలు పడి హైదరాబాద్ దాకా రావడం.. ఇక్కడ గంటల తరబడి రోజంతా క్యూలో నిల్చోవడం లాంటి ఇబ్బందులు తొలగుతాయని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి.. గ్రామ, మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని కోరుతున్నారు.