Fees: MBBS ఫీజులు కాదు అవి LKG ఫీజులు! బాబోయ్.. అప్పులపాలవుతున్న పేరెంట్స్!
excerpt: స్కూళ్లు మొదలయ్యాయి.. బడి గంటలు మోగుతున్నాయి..అదే సమయంలో పేరెంట్స్ గుండెల్లో రైళ్లూ పరిగెడుతున్నాయి..ఫీజుల దెబ్బకు తల్లిదండ్రుల ఫ్యూజులవుట్ అవుతున్నాయి!
LKG ఫీజు లక్ష రూపాయలంట! అది కూడా హైదరాబాద్ లాంటి సీటిల్లో కాదు.. టైర్2 టౌనుల్లో కూడా కొన్ని స్కూల్స్ ఇలానే వసూలు చేస్తున్నాయి. LKGలో చదివేది ఏముంటుంది..? అంత ఎక్స్‌ట్రా కర్క్యూలర్ యాక్టివిటిస్ నేర్చుకునే వయసు కూడా కాదు వారిది. వాళ్ల స్కూల్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంటే దానికి ఆ చిన్న పిల్లోడు ఎందుకు డబ్బులు కట్టాలి.?
సరే మిగిలిన విద్యార్ధుల తల్లిదండ్రులైనా అంత కట్టగలరా..? ‘ధరలు పెరిగిపోయాయి.. టీచర్లకు జీతాలు ఇచ్చుకోవాలి, స్కూల్ మెయింటైన్ చేయలి..మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండంటూ’ ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పే విషయాలు నిజమే కావొచ్చు..కానీ అంత డబ్బులు కట్టే స్థితిలో చాలా మంది పేరెంట్స్ లేరు.. పోని మిగిలిన స్కూల్స్‌లో జాయిన్ చేద్దామన్నా మనసు ఒప్పుకోదు.. మంచి స్కూల్ కాకపోతే మంచి లైఫ్ ఉండదేమోనన్న భయం ఉంటుంది. అటు కార్పొరేట్ స్కూల్స్ సంగతి మాట్లాడుకోని టైమ్ వేస్ట్.. ఫోర్త్ క్లాసులోనే ఐఐటీ అంట.. అందులో ఏం ఉండదు.. 5th క్లాస్ పొర్షన్ ఉంటుంది..దానిపై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.. అవి కూడా మార్కుల కోసం బట్టి కొట్టి చదివిస్తారు.. ఇక్కడ మ్యాథ్య్ కూడా బట్టి కొడతారు..అదంతే.. ఇండియాలోనే మ్యాథ్య్‌ని బట్టి కొట్టే విద్యార్థులుంటారు.. అది కూడా వేలకు వేలు కట్టి మరి బట్టి కొడతారు..కార్పొరేట్ దందా అలానే ఉంటుంది..! దానికి ప్రభుత్వాలు కూడా కొమ్ముకాస్తాయి..అప్పుడప్పుడు రూల్స్ అంటూ మాట్లాడుతాయి..నిబంధనలు తుంగలో తొక్కినా పట్టించుకోవు.!
ఎలాంటి అనుమతి లేకుండా ఏటా 20 నుంచి 30శాతం ఫీజులను యాజమాన్యాలు యథేచ్ఛగా పెంచుతూ వెళ్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదు. జీవో నెంబర్ 91 ప్రకారం దరఖాస్తు రుసుం రూ.100, అడ్మిషన్ ఫీజు రూ.500 మాత్రమే తీసుకోవాలి. పాఠశాలలో పుస్తకాలు, విద్యా సామగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలు పెట్టకూడదు. సెక్షన్ -8(1) ప్రకారం విద్యాసంస్థ పేర్లకు ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ -టెక్నో వంటి పదాలను చేర్చకూడదు. జీవో 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అబ్బే.. గ్రౌండ్ కాదు కదా.. బాత్‌రూమే సరిగ్గా ఉండదు.. అందరూ ఒక్కచోటే పని కానివ్వలి.. ఒకరి తర్వాత ఒకరు.. ఫీజులు మాత్రం వేలకు వేలు.. కట్టకపోతే మీ అబ్బాయి ఎందుకు పనికిరాడు..! ఇదో టైప్ ఆఫ్ ఎమోషనల్ వైట్‌మెయిల్..!
ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్కూళ్లను నడిపిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వరంగల్, హన్మకొండ పట్టణాల్లో 200 పైచిలుకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో సొంత గ్రౌండ్ కలిగిన పాఠశాలలు చాలా తక్కువ. కనీస ప్రమాణాలు, విద్యా నిబంధనలు పాటించకుండానే రన్ చేస్తున్నాయి. అయినా కూడా LKG ఫీజు 30వేలకు పైగ వసూలు చేస్తున్నాయి..అది కూడా బుక్ ఫీజ్ కలపకుండా..కేవలం తమ స్కూల్స్‌కి వచ్చిన రిజల్ట్‌ని మార్కెటింగ్ చేసుకొని అధిక ఫీజులు ఛార్జ్ చేస్తున్నాయి.. ఎలాగో పేరెంట్స్‌కి కూడా కావాల్సింది చదువే కదా.. పిల్లలు ఆడాలి..పాడాలి..డ్యాన్స్ చేయాలి అంటే ఊరుకొరు.. అందుకే కేవలం చదువు కోసమే లక్షలు ఖర్చు పెడతారు తల్లిదండ్రులు.. అదే వాళ్ల వీక్ పాయింట్.. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల క్యాష్ పాయింట్..!