RAIN ALERT: వాయుగుండంలా అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన..
తమిళనాడు నుంచి మొదలు.. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణం తుఫానుగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు.
RAIN ALERT: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. సముద్రతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నెల 15, 16 నాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి అనువైన వాతావరణం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి
గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం.. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు నుంచి మొదలు.. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణం తుఫానుగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు. తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయ్. సోమవారం అర్ధరాత్రి నాగపట్నంలో అతి భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ్. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
బంగాళాఖాతం మధ్య భాగంలో గాలుల వేగం పెరిగింది. గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయ్. 15, 16 తేదీల్లో బంగాళాఖాతం నైరుతి దిశ మీదుగా తమిళనాడు, ఏపీ తీర ప్రాంతాలపై ఈ గాలులు వీస్తాయ్. దీంతో మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.