RAIN ALERT: తెలంగాణకు తుఫాన్ ముప్పు.. 4 రోజులు వానలే వానలు..

డిసెంబరు మొదటి వారంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రభావంతో ఏపీవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 06:02 PMLast Updated on: Nov 29, 2023 | 6:02 PM

Rain Alert Issued For Telangana And Ap By Imd

RAIN ALERT: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయ్. ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయ్. దీంతో రైతులతో పాటు సాధారణ జనం కూడా ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయ్. 3 రోజుల పాటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపింది. కొన్నిచోట్ల ఇప్పటికీ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. దీనికి సంబంధించి వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్‌లు.. ఆ ఇద్దరి మీదే భారీగా పందేలు..

దక్షిణ అండమాన్ సమీపంలో మలక్కా జలసంధి ప్రాంతంలో, బంగాళాఖాతంలో.. సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీకి తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్‌, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. డిసెంబరు మొదటి వారంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రభావంతో ఏపీవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తుఫాన్ ప్రభావం తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు పంటలు కోత దశలో ఉండటంతో.. అధికారులు, రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లకూడదని చెప్తున్నారు.