FAKE 500 NOTE : రాముడి బొమ్మతో నకిలీ 500 నోట్.. మోసపోకండి.. RBI కి సంబంధం లేదు
జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ క్రిమినల్స్, కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. అయోధ్యలో టిక్కెట్ల పేరుతో ఫేక్ కాల్స్ చేసి జనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాముడి ఫోటోతో 500 రూపాయల నోట్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓ వైపు రాముడు, మరోవైపు రామ మందిరంతో నకిలీ 500 నోట్ ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి.
జనవరి 22న అయోధ్యలోని (Ayodhya) శ్రీరామ మందిరంలో రాముడి (Sri Ram Mandir) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ క్రిమినల్స్, కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. అయోధ్యలో టిక్కెట్ల పేరుతో ఫేక్ కాల్స్ చేసి జనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాముడి ఫోటోతో 500 రూపాయల నోట్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓ వైపు రాముడు, మరోవైపు రామ మందిరంతో నకిలీ 500 నోట్ ఫోటోలు (fake 500 note) సర్క్యులేట్ అవుతున్నాయి.
జనం సెంటిమెంట్ (People sentiment) ను క్యాష్ చేసుకోడానికి కేటుగాళ్ళు ఏదో ఒక టెక్నిక్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నకిలీ 500 రూపాయల నోట్ సర్క్యులేట్ అవుతోంది. ఇది నిజంగా రాముడి మీద భక్తితోనో.. లేదంటే.. బీజేపీ మీద అభిమానంతో చేశారో కానీ.. ఇది ఫేక్ నోట్. ఎందుకంటే RBI ముద్రించిన 500 రూపాయల నోట్ పై.. ఓ వైపు మహాత్మా గాంధీ బొమ్మ.. మరోవైపు ఎర్రకోట ప్రింట్ చేసి ఉంటుంది. కానీ ఫేక్ నోట్ మీద.. ఓ వైపు రాముడు.. మరోవైపు అయోధ్య రామమందిరం..(Ayodhya Ram Mandir) ఇది కాకుండా రామబాణం (Rambanam) కూడా ప్రింట్ చేశారు. ఈ 500 రూపాయల నోటును ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 500 నోటు మీద ఉండే రెడ్ ఫోర్ట్, గాంధీజీ బొమ్మను తొలగించాలని ప్రధాని మోడీ నిర్ణయించారనీ.. అందుకే ఈ కొత్త నోటును విడుదల చేస్తున్నట్టు ఫేక్ క్యాంపెయిన్ నడుస్తోంది. హిందీ, ఇంగ్లీష్, బంగ్లా భాషల్లో FB లో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. నోట్ ని కూడా ఫేక్ అని గుర్తుపట్టలేనంతగా.. మార్ఫింగ్ చేశారు.
సోషల్ మీడియాలో రాముడి బొమ్మతో సర్క్యేలేట్ అవుతున్న నోటును ముద్రిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గానీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందుగా ఎలాంటి ప్రకటనా లేదు. అసలు ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే లేదని RBI అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ వెబ్ సైట్ లో కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్న.. గాంధీజీ, రెడ్ ఫోర్ట్ ఇమేజెస్ కలిగిన నోటు గురించే వివరాలు ఉన్నాయి. అందువల్ల ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని నిపుణులు కోరుతున్నారు. నోట్లు ప్రింట్ చేయడమే తప్పుడు వార్త అంటే.. రాముడి బొమ్మతో ఉన్న 500 నోట్లు ముందు మీకే కావాలా.. అయితే ఎంతో కొంత డిపాజిట్ చేయండి.. అంటూ సైబర్ క్రిమినల్స్ వల విసిరే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల.. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు RBI వెబ్ సైట్ చూడటం గానీ లేదంటే PIB ఫ్యాక్ట్ చెక్ లో గానీ వెరిఫై చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.