Super Blue Moon: ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ నెలలోనే అరుదైన బ్లూ మూన్..

బ్లూ మూన్ అనగానే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. చంద్రుడు ఆరెంజ్ రంగులోనే కనిపిస్తాడు. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. సాధారణంగా నెలలో ఒక్కరోజే ఇలా కనిపిస్తాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 02:11 PMLast Updated on: Aug 28, 2023 | 2:11 PM

Rare Super Blue Moon To Illuminate The Sky On August 30

Super Blue Moon: ఈ నెలలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 30, బుధవారం రోజున అరుదైన బ్లూ మూన్ ఏర్పడబోతుంది. బ్లూ మూన్స్ దశాబ్దానికి ఒక్కసారే ఏర్పడుతాయి. దీన్ని ఈ వారంలో చూడొచ్చు. బ్లూ మూన్ ఏర్పడినప్పుడు చంద్రుడు అతి దగ్గరగా, పెద్దగా కనిపిస్తాడు. ఈ ఏడాది చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించడం ఇది మూడోసారి. ఒక నెలలో రెండు పౌర్ణమిలు వచ్చిన సందర్భాల్లో ఇలా జరుగుతుంది.
బ్లూ రంగులో ఉంటుందా..?
బ్లూ మూన్ అనగానే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. చంద్రుడు ఆరెంజ్ రంగులోనే కనిపిస్తాడు. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. సాధారణంగా నెలలో ఒక్కరోజే ఇలా కనిపిస్తాడు. కానీ, ఈసారి ఆగష్టులో రెండోసారి కూడా పూర్తిగా కనిపించబోతున్నాడు. ఈ నెల 1న పౌర్ణమిరాగా, ఈ నెల 30న మరోసారి పౌర్ణమి రాబోతుంది. గత ఫిబ్రవరిలో ఒక్కసారి కూడా ఫుల్ మూన్ ఏర్పడలేదు. నాసా తెలిపిన వివరాల ప్రకారం.. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బ్లూమూన్ ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు. ఫుల్‌ మూన్‌ రోజు బ్లూ సపర్‌ మూన్‌ రావడానికి 3 శాతం అవకాశం ఉంటే, పౌర్ణమి రోజు సూపర్‌ మూన్‌ రావడానికి 25శాతం అవకాశం ఉంటుంది. బ్లూ మూన్ ఏర్పడినప్పుడు సాధారణంగా కనిపించే చంద్రుడికంటే 16 శాతం కాంతిమంతంగా కనిపిస్తాడు. బుధవారం సాయంత్రం చీకటి పడ్డ తర్వాత నుంచి బ్లూమూన్ చూడొచ్చు. రాత్రి 8.30 తర్వాత సూపర్‌ బ్లూ మూన్‌ అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశంలో అద్భుతాలు చూడడాన్ని ఎంజాయ్ చేసేవాళ్లు ఇలాంటి వాటిని ఆసక్తిగా చూస్తారు. యూరప్‌ ప్రజలకు బ్లూ మూన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సారి బ్లూమూన్ చూసేటప్పుడు మరో అరుదైన అవకాశం కూడా దొరకనుంది. అదే శనిగ్రహాన్ని కూడా చూసే అవకాశం. బుధవారం రాత్రి చంద్రుడితోపాటు శనిగ్రహం కూడా కనిపించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. శనిగ్రహం చంద్రుడికి దగ్గరగా వస్తుందని తెలిపారు. బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌తో చూస్తే వీక్షకులకు శని గ్రహం ఆనవాళ్లు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజు శని గ్రహం నేరుగా సూర్యుడికి ఎదురుగా వస్తుంది. ఆదివారం రాత్రి వరకు అలా సూర్యుడికి ఎదురుగానే ఉంటుంది. సూర్యుడి కాంతి సూర్యగ్రహంపై పడినప్పుడు కాస్త ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు శనిగ్రహం కనిపిస్తుందని అన్నారు.