మనిషి కాదు ఋషి, చిన్న ఇంట్లో సామాన్యుడిలా రతన్‌ టాటా తమ్ముడు

వ్యాపార సామ్రాట్ రతన్‌ టాటా జీవితం ఎందరికో ఆదర్శం. ఏ విలువలతో ఆయన జీవితం మొదలు పెట్టారో అదే విలువలను ఆయన తుది శ్వాస విడిచే వరకూ కొనసాగించారు. వయస్సు మీద పడటం, ఆరోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2024 | 12:29 PMLast Updated on: Oct 12, 2024 | 12:29 PM

Ratan Tatas Younger Brother Is Like A Common Man In A Small House

వ్యాపార సామ్రాట్ రతన్‌ టాటా జీవితం ఎందరికో ఆదర్శం. ఏ విలువలతో ఆయన జీవితం మొదలు పెట్టారో అదే విలువలను ఆయన తుది శ్వాస విడిచే వరకూ కొనసాగించారు. వయస్సు మీద పడటం, ఆరోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. రతన్ మరణవార్త తెలిసిన వెంటనే తన సోదరుడు వీల్ చైర్‌లో వెళ్లి నివాళులు అర్పించారు. టాటా సోదరుడు అనగానే పెద్ద లగ్జరీ కార్‌లో పది మంది సహాయకులతో వచ్చాడు అనుకుంటే తప్పు. ఆయన చాలా సింపుల్‌గా చిన్న ఇంట్లో బతికిన, బతుకున్న వ్యక్తి. ఆయన కూడా ఎంతో అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనే జిమ్మీ టాటా. రతన్ టాటాకు స్వయానా తమ్ముడు. ఒకవైపు రతన్ టాటా తన జీవితాన్ని వ్యాపారాలు, దాతృత్వాలతోనే గడపగా.. సోదరుడు జిమ్మీ మాత్రం అత్యంత సాధారణ జీవితాన్నే గడిపారు. ప్రస్తుతం ఆయన ముంబైలో కొలాబాలో నివాసముంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటూ నిరాండబర జీవితాన్ని గడిపేస్తున్నారు. రతన్ టాటాకు సోదరుడైన జిమ్మీకి మొదటినుంచి వ్యాపారంపై ఆసక్తి లేదు.

కనీసం ఆయన మొబైల్ ఫోన్ కూడా వాడరు. టెక్ గాడ్జెట్లను దగ్గరకు కూడా రానివ్వరు. కేవలం పుస్తకాలు, న్యూస్ పేపర్లు మాత్రమే చదివేందుకు బాగా ఇష్టపడతారు. ఒక్క మాటలో చెప్పారంటే జిమ్మి టాటా ఇళ్లు విడిచి బయటకు వెళ్లరనే చెప్పాలి. జిమ్మీ టాటాను జిమ్మీ నావల్ టాటా కూడా పిలుస్తారు. రతన్ టాటాకు తమ్ముడు కావడంతో ఆయనకు టాటా గ్రూప్‌లో పెద్ద వాటానే ఉంది. అయినప్పటికీ కూడా జిమ్మీ టాటా కుటుంబ వ్యాపారంపై ఆసక్తిని కనపర్చలేదు. విలాసవంతమైన జీవితానికి దూరంగా మధ్యతరగతి సామాన్యుడిలా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయనకు డబ్బు, విలాసాలపై రవ్వంత కూడా ఆసక్తి లేదు. ఇటీవలే జిమ్మీ టాటా పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో కలిసి ఫొటో కూడా దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అప్పుడే రతన్ టాటాకు తమ్ముడు కూడా ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకూ తన ఆస్తినే కాదు, తన బ్యాగ్రౌండ్‌ కూడా ఎవరికీ తెలియకుండా సింపుల్‌గా బతికేశారు జిమ్మీ టాటా. 2024 నాటికి, జిమ్మీ టాటా నికర విలువ టాటా కంపెనీలలో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జిమ్మీ నికర ఆదాయం విలువ దాదాపు 3 వేల 800 కోట్లు పైమాటే. 2022 నవంబర్ నెలలో జిమ్మీ, రతన్ టాటాల ఉమ్మడి విలువ 23 వేల 874 కోట్లు. వ్యాపార ప్రపంచంలో రతన్ టాటా మాత్రమే కనిపించగా.. టాటా ప్రధాన సంస్థలలో జిమ్మీ వాటాల యాజమాన్యం ఆయన సంపద గణనీయంగా పెంచింది. అంతేకాదు.. సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీగా కూడా జిమ్మీ టాటా పనిచేస్తున్నారు. 1989లో వారి తండ్రి నావల్ టాటా మరణించిన తర్వాత ఇది ఆయనకు వచ్చింది. వేల కోట్లకు అధిపతి అయినా కూడా ఇంత సింపుల్‌గా బతకడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. నిజంగా ఇలా బతకడం కేవలం టాటా కుటుంబానికి మాత్రమే సాధ్యమేమో.