RATION CARD: రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చాలా.. ఇలా చేయండి..
పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డుల్లో చేర్చడానికి ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు. దీనికోసం ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద గుర్తింపు రుజువు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. ఇవన్నీ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉండాలి.
RATION CARD: ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డులకు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నిరంతరం కొనసాగే పథకమని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో కొందరు.. తమ పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, అదెలాగో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుల్ని ఇతర పథకాలకు కూడా వినియోగించే వీలుంది. అందువల్ల చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేస్తున్నారు.
REVANTH REDDY: గురువారం ఢిల్లీకి రేవంత్.. షర్మిల కోసమేనా..?
ఈ నేపథ్యంలో పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డుల్లో చేర్చడానికి ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు. దీనికోసం ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద గుర్తింపు రుజువు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. ఇవన్నీ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే.. రాష్ట్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌లో లేదా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చడానికి ఆహార శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి యాడ్ మెంబర్ లేదా రేషన్ కార్డ్ యాడ్ నేమ్ పై క్లిక్ చేయాలి. అందులో మీ పేరు, రేషన్ కార్డు నెంబర్, పిల్లల పేరు, బర్త్ సర్టిఫికెట్, డేట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఆధార్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. సంబంధిత పత్రాలు స్కాన్ చేసి, అప్‌లోడ్ చేయాలి.
నిర్దేశిత ఫీజు చెల్లించాలి. తర్వాత ఒకసారి అన్ని వివరాలు సరి చూసుకుని, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అనంతరం మీ మొబైల్‌కు ఒక నెంబర్ వస్తుంది. దీని ద్వారా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అన్ని అర్హతలు, వివరాలు సరిగ్గా ఉంటే పిల్లల పేర్లు యాడ్ అవుతాయి. పిల్లల పేర్లు యాడ్ కావడానికి కనీసం పదిహేను రోజుల సమయం పడుతుంది. పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చాలంటే వారి వయసు 18 మించకూడదు.