FREE BUS RIDE: మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆ కార్డు ఉంటేనే..
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీల్లో భాగంగా మొదటి హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 9 నాడు సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
FREE BUS RIDE: డిసెంబర్ 9, శుక్రవారం నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ స్కీమ్ అమల్లోకి వస్తోంది. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ పథకం విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్వయంగా ఈ పథకాన్ని మహిళా మంత్రులతో కలిసి ప్రారంభిస్తున్నారు.
DHARANI SCHEME: ధరణిలో దొంగలు పడ్డారు.. చేతులు మారిన లక్షల రూపాయలు..!
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీల్లో భాగంగా మొదటి హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 9 నాడు సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో సిటీ బస్సులు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే అందుకోస ఓ షరతు పెట్టింది ప్రభుత్వం. మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలి. అప్పుడే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి గుర్తింపు కార్డు అడగటం ఎందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పథకం కేవలం తెలంగాణలోని మహిళలకు మాత్రమే ఉద్దేశించినది. ఇతర రాష్ట్రాల మహిళలకు అనుమతి లేదు. వాళ్ళు ఎంత టిక్కెట్ ధర ఉంటే అంతపెట్టి కొనుక్కోవాల్సిందే. కర్ణాటకలో కూడా ఇలాగే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
అందుకే గుర్తింపు కార్డు చూపించాలని రాష్ట్రమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. కేబినెట్ మీట్ తర్వాత తెలిపారు. ఆర్టీసీ అధికారులతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. మహిళల ఉచిత ప్రయాణంపై గైడ్‌లైన్స్ రెడీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది మహిళలు.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్‌తో ఆర్టీసీపై రోజుకు 4 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మహిళలంతా ఆర్టీసీలో ప్రయాణిస్తే.. మగవాళ్ళకి సీట్లు ఉండవు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకోసం బస్సుల సంఖ్య పెంచాలన్న డిమాండ్ వస్తోంది. అంతేకాదు.. ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆటోవాలాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేస్తుందన్నది చూడాలి.